గెట్‌లాస్ట్ అంటూ...సమంత, సిద్దార్థలపై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం
హైదరాబాద్: మహేష్ బాబు సినిమా '1-నేనొక్కడినే' పోస్టర్‌పై సమంత తన ట్విట్టర్లో కామెంట్ చేయడం మహేష్ బాబు అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. సమంత, సిద్దార్థ గెట్ లాస్ట్ అంటూ వారిపై ట్వీట్ల వర్షం కురిపించారు. సమంత కామెంట్లను సపోర్టు చేసిన హీరో సిద్ధార్థపై కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మీరిద్దరూ ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోవాలంటూ ఫ్యాన్స్ కామెంట్ చేసారు.
మహేష్ బాబు బీచ్‌లో నడుస్తుంటే...హీరోయిన్ క్రితి సానన్ అతని కాలి అడుగులను ఫాలోఅవుతూ మోకాళ్లు, చేతులతో పాకుతూ ఉండటం విమర్శలు వస్తున్నాయి. ఆడది మగాడి కాళ్ల వద్ద బానిస అనే అర్థం వచ్చేలా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. హీరోయిన్ సమంత కూడా ఈ పోస్టర్‌ను విమర్శిస్తూ పరోక్షంగా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కామెంట్స్ చేసింది.
'1-నేనొక్కడినే' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా తెరంగ్రేటం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
స్లైడ్ షోలో మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్..

Sriram Tej @sreeramtej
ఈ పోస్టర్లో ఎలాంటి తప్పుడు అర్థం లేదు. కావాలని వివాదా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. సమంత, సిద్ధార్థ గెట్ లాస్ట్

Prince Mahesh @MAHESH_MANIA007
తెగ చించుకుని కామెంట్లు చేస్తున్నావ్. ఈ పోస్టర్లో తప్పేముంది? నీ సినిమాల్లో ఇలాంటి సీన్లు లేవా?

Ravi Teja @ravitheratedR
గెట్ లాస్ట్ సమంత. సమంత ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందే.

Saran Raju @saranraju
సమంత, సిద్ధార్థలను తెలుగు సినిమాల నుంచి బ్యాన్ చేయాలి.

Abdul Rehman Shaik @princenthfa
ముందు సినిమాలో ఆ సాంగు చూసిన తర్వాత మాట్లాడు. పోస్టర్ చూసి తెగ చించుకోవడం సరికాదు.

Umakanth @umakanthonline
సమంత, సిద్ధర్థ తెలుగు సినిమాల్లో నటించడం మానేయాలి. కావాలని ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Santhosh Reddy @santhu101991
గెట్ లాస్ట్ సమంత అండ్ సిద్ధార్థ్. సమంత అంటే మాకు ఇష్టమే. కానీ ఆవిడ ప్రవర్తనే నచ్చడం లేదు.

Mahesh Fanatic @urstrulyFanatic
ఇలాంటి పోస్టర్లు చాలా సినిమాల్లో ఉన్నాయి. వాటిపై ఎవరూ స్పందించలేదు. కానీ ఈ సినిమాపైనే ఎందుకు? మీడియా ఈ విషయం అర్థం చేసుకోవాలి.

Sharath Goud @sharathpalle94
గెట్ లాస్ట్ సమంత...తెలుగు సినిమా పరిశ్రమలో నటించడం మానేయ్.

Sarath Chandra @sarath5108
చాలా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. ముందు వాటిని ఖండించు. గెట్ లాస్ట్ సమంత అండ్ సిద్ధార్థ.


Click it and Unblock the Notifications











