మహేష్ VS పవన్: మెగా ఫ్యాన్స్ ముందు బాహుబలి లాంటి రికార్డు.. బద్దలు కొట్టడం సాధ్యమేనా?
గత మూడేళ్ళ ముందు వరకు కూడా సోషల్ మీడియాలో లక్షల ట్వీట్స్ వస్తేనే ఒక సరికొత్త రికార్డ్. కానీ ఈ రోజుల్లో రీట్వీట్స్ పోటీలు కోట్లను దాటేస్తున్నాయి. ముఖ్యంగా అభిమానుల హడావుడికి రోజుకో రికార్డు క్రియేట్ అవుతోంది. ఫేస్ బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఎకౌంట్స్ లలో జనాలు చాలా వరకు కూల్ గానే కనిపిస్తున్నారు. కానీ ట్విట్టర్ లో మాత్రం ఆవేశంతో ఊగిపోతున్నారు.

మహేష్ ఫ్యాన్స్ న్యూ రికార్డ్
శనివారం మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ గ్యాప్ లేకుండా ట్విట్టర్ ల్ మహేష్ బాబు కి బర్త్ డే విషెస్ అంధించారు. #hbdmaheshbabu హ్యాష్ ట్యాగ్ పేరుతో 24గంటల్లో ఏకంగా 60 మిలియన్ల ట్వీట్స్ వెలువడ్డాయి. అంటే మన భాషలో ఆరు కోట్ల ట్వీట్స్. ట్విట్టర్ వరల్డ్ లో ఇదే నెంబర్ వన్ రికార్డ్ అని చేబుతున్నారు.

మొన్నటి వరకు పవన్ రికార్డ్
అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే విషెస్ అందిస్తూ ఇటీవల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 24గంటల్లో 28మిలియన్స్ కి పైగా ట్వీట్స్ వేశారు. మొన్నటివరకు ఇదే అత్యదిక రికార్డు. ఆ తరువాత మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ అభిమానులు రికార్డులు ఉండేవి. కానీ ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ఆ రికార్డుకు చెక్ పెట్టేశారు.

ఒక్క అభిమాని నుంచి 500ట్వీట్
కేవలం 24గంటల్లోనే 1.28లక్షల మంది అభిమానులు ఈ ట్వీట్స్ వేసినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు ఒక్కో అభిమాని 500కి పైగా హ్యాష్ ట్యాగ్ క్రియేయ్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మెగా అభిమానుల ముందు బాహుబలి లాంటి రికార్డ్ ఉంచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇది పెద్ద సవాల్ అనే కామెంట వస్తున్నాయి.

మెగా అభిమానులు బ్రేక్ చేస్తారా?
ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అలాగే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరుపుకొనున్నారు. వీరి బర్త్ డేకు మెగా అభిమానులు ఎలా కౌంటర్ ఇస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. రికార్డును బ్రేక్ చేయాలి అంటే గతంలో కంటే ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మరి ఈ ట్విట్టర్ యుద్ధం భవిష్యత్తులో ఇంకెలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











