మహేష్ బాబుతో ‘రెబల్’ విలన్ ఫైట్

ఈ విషయం గురించి విక్రమ్ సింగ్ ట్విట్టర్లో పేర్కొంటూ....'రెబల్ చిత్రం తర్వాత మహేష్ బాబు, సుకుమార్ చిత్రంలో అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. రామ్ లక్షణ్ స్టంట్స్ చాలా బాగా కంపోజ్ చేసారు. నా పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను' అంటూ పేర్కొన్నాడు.
ఈ చిత్రంలో మహేష్ సరసన క్రితి సానన్ అనే కొత్త అమ్మాయి అమ్మాయి ఎంపికైంది. ఇప్పటి వరకు మొడలింగ్ రంగంలో రాణిస్తున్న ఆమెకు ఇదే తొలి సినిమా అవకాశం. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.
సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్ బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం కోసం మహేష్ బాబు కొత్త లుక్ తో చూపెట్టనున్నారు. ఇందుకోసం అయన అమెరికా నుండి ప్రత్యేకంగా ట్రైనర్ ని కూడా తెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications











