»   » నిజమే....ఇక్కడ మహేష్ బాబు వయసు 16 ఏళ్లే!

నిజమే....ఇక్కడ మహేష్ బాబు వయసు 16 ఏళ్లే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో సూపర్ స్టార్‌గా ఎదిగిన మహేష్ బాబు వాస్తవమై వయసు 39 ఏళ్లే అయినా....సినిమా ఇండస్ట్రీలో ఆయన వయసు మాత్రం 16 ఏళ్లే. మహేష్ బాబు హీరోగా నటించిన తొలి సినిమా ‘రాజకుమారుడు' విడుదలైన(జులై 30, 1999) 16 సంవత్సరాలు పూర్తయింది. కెరీర్లో మహేష్ బాబు ఇప్పటి వరకు 20 సినిమాలు చేసాడు. ‘శ్రీమంతుడు' మహేష్ బాబు 20వ సినిమా.

హీరోగా మహేశ్ తొలి చిత్రం రాజకుమారుడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు వ్యాపార పరంగా పెద్ద విజయాల్ని సాధించకపోయినా మహేష్ నటనకు గుర్తింపు లభించింది. 2001లో సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ కు తొలి భారీ విజయాన్ని అందించింది. కానీ 2002 మహేష్ కు సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సంవత్సరం విడుదల అయిన టక్కరి దొంగ, బాబీ సినిమాలు రెండూ పరాజయం పాలయ్యాయి.

2003లో మహేష్ కు తను ఎదురుచూస్తున్న విజయం లభించింది. గుణశేఖర్ దర్శకత్వంలో విడుదల అయిన ‘ఒక్కడు' చిత్రం 2003వ సంవత్సరానికి అతి పెద్ద హిట్ చిత్రంగా నిలచింది. భూమిక కథానాయికగా, ప్రకాష్ రాజ్ ప్రతినాయకునిగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలచింది. 2003లోనే విడుదల అయిన ‘నిజం' చిత్రం పరాజయం పాలయినప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని నటనకుగానూ మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నాడు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..

మహేష్ బాబు ‘నాని'

మహేష్ బాబు ‘నాని'

2004లో తమిళనాట విజయవంతమైన న్యూ చిత్రం మహేష్ ముఖ్యపాత్రధారిగా తెలుగులో ‘నాని' గా పునర్నిర్మితమయ్యింది. మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది. అదే యేడాది విడుదలైన అర్జున్ పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. 18కోట్ల ఖర్చుతో నిర్మితమయిన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది.

మహేష్ బాబు ‘అతడు'

మహేష్ బాబు ‘అతడు'

తర్వాత మహేష్ ఒక సంవత్సరం పాటు ఏ చిత్రాన్నీ అంగీకరించలేదు. ‘అతడు' చిత్ర నిర్మాణంలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. 2005లో విడుదల అయ్యిన ‘అతడు' చిత్రం తెలుగునాట మాత్రమే కాక, విదేశాలలోని తెలుగువారి మన్ననలను అందుకుంది. స్వతహాగా మంచివాడయినప్పటికీ పరిస్థితుల వలన కిరాయిహంతకుడై, తోటివారి ద్రోహం వలన ఇంకొకరి ఇంట్లో మారుపేరుతో తలదాచుకునే నందగోపాల్ పాత్రలో మహేష్ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఈ సినిమాలో నటనకు మహేష్ కు మరొకసారి బంగారు నంది లభించింది.

మహేష్ బాబు ‘పోకిరి'q

మహేష్ బాబు ‘పోకిరి'q


2006లో మహేష్ నటించిన చిత్రం ‘పోకిరి' విడుదల అయ్యింది. వ్యాపార పరంగా ఈ చిత్రం అమోఘమయిన విజయాన్ని నమోదుచేసింది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఈ చిత్రం అతి పెద్ద హిట్ గా నిలచింది. ఈ చిత్రానికి గాను మహేష్ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని సైతం గెలుకున్నాడు.

మహేష్ బాబు ‘సైనికుడు'

మహేష్ బాబు ‘సైనికుడు'

‘పోకిరీ' తరువాత నిర్మాణమయిన ‘సైనికుడు' చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.

మహేష్ బాబు ‘అతిథి'

మహేష్ బాబు ‘అతిథి'

ఆ తరువాత వచ్చిన ‘అతిథి' చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది.

మహేష్ బాబు ‘ఖలేజా'

మహేష్ బాబు ‘ఖలేజా'

అనంతరం 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ‘ఖలేజా' భారీ వసూళ్లను సాధించినప్పటికీ అభిమానుల్లో భారీ అంచనాల వల్ల పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి.

మహేష్ బాబు ‘దూకుడు'

మహేష్ బాబు ‘దూకుడు'

‘ఖలేజా' ఆ తర్వాత వచ్చిన 'దూకుడు' చిత్రం మహేశ్ కెరియర్ లోనే ఇంకొక భారీ విజయం గా నిలబడింది. అలాగే 'బిజినెస్ మాన్' కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

వెంకటేష్ తో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే మల్టీస్టారర్ సినిమా భారీ విజయం సాధించింది.

మహేష్ బాబు ‘వన్'

మహేష్ బాబు ‘వన్'


సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘వన్' సినిమా పరాజయం పాలైంది.

మహేష్ బాబు ‘శ్రీమంతుడు'

మహేష్ బాబు ‘శ్రీమంతుడు'

ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు' చిత్రంలో నటిస్తున్నాడు.

English summary
Mahesh Babu, one of the biggest stars in contemporary Telugu cinema, has completed 16 years in the industry.
Please Wait while comments are loading...