»   » మహేష్ బాబు-కొరటాల శివ మూవీ ప్రస్తుత స్థితి ఏంటి?

మహేష్ బాబు-కొరటాల శివ మూవీ ప్రస్తుత స్థితి ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసింతే. ఈ చిత్రాన్ని తాత్కాలికంగా ‘శ్రీమంతుడు' అనే టైటిల్ తో పిలుస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. జూన్ మొదటి వారంలోగా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో మహేష్ బాబు-శృతి హాసన్ మీద ఓ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ బాబు మల్టీ మిలయనీర్ పాత్రలో కనిపించబోతున్నాడు. జగపతి బాబు....మహేష్ బాబు తండ్రి పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి మగాడు' టైటిల్ కే ఓటేసారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఆ చిత్రం పీఆర్వో, మహేష్ సన్నిహితుడు బి.ఎ రాజు ఖంచించారు. మే 31 న ఫస్ట్ లుక్ లో టైటిల్ ఏమిటన్నది తెలుస్తుందని క్లియర్ చేసారు. 'మగాడు' టైటిల్ మాత్రం కాదన్నారు.

Mahesh Babu

ఓవర్సీస్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్, చిత్ర నిర్మాణం పట్ల ఎంతో ఫ్యాషన్ వున్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ (తమ్ముడు), సి.వి.ఎం.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటంతో అభిమానుల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ తొలి చిత్రంగా నిర్మాణవౌతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: మది, ఫైట్స్: అనల్‌అరసు, ఆర్ట్: కె.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, నిర్మాతలు: ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కొరటాల శివ.

English summary
Mahesh Babu-Koratala Siva film is nearing completion. According to the latest update, a song is currently being shot on Mahesh and Shruthi Haasan in RFC.
Please Wait while comments are loading...