మహేష్ టైటిల్ '1 నేనొక్కడినే', ఫస్ట్ లుక్ రిలీజ్(ఫోటోలు)
హైదరాబాద్ : మొత్తానికి మహేష్ చిత్రం టైటిల్ పై టెన్షన్ తొలిగింది. టైటిల్ ని '1 నేనొక్కడినే' అని ఫిక్స్ చేసారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు విడుదల చేసారు. మీరు చూస్తున్న ఫస్ట్ లుక్ అదే.
మహేష్‌బాబు నటిస్తున్న కొత్త చిత్రం పేరుపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ సినిమాకి 'ది ప్రిన్స్', 'కొలంబస్', 'వన్' అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయని ప్రచారం జరుగాయి. కానీ ఫైనల్ గా ఈ చిత్రానికి ఈ చిత్రానికి '1 నేనొక్కడినే' అనే టైటిల్ ఖారారు అవ్వటం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.
దర్శకుడు సుకుమార్‌గానీ, నిర్మాతలుగానీ టైటిల్ విషయంలో గోప్యత పాటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగుతోంది. ఈ చిత్రంలో మహేష్‌కి జోడీగా కొత్తమ్మాయి కృతిసనన్ నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.

అక్కడ రాత్రి వేళల్లో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సల్మాన్‌ఖాన్ రీసెంట్ హిట్ ‘ఏక్‌థా టైగర్' చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన ఫైట్ మాస్టర్ నేతృత్వంలో ఈ పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. జూన్ 4 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుందని సమాచారం.
ఈ షెడ్యూల్ అనంతరం జూన్ 13 నుంచి యూకేలో 45 రోజుల భారీ షెడ్యూల్‌ని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. మహేష్ సినిమాకు ఆయన తొలిసారి పనిచేస్తుండటం విశేషం.

ఇప్పటివరకూ సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన అన్ని ఆల్బమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వాటిని మించేలా అద్భుతమైన సంగీతాన్ని దేవిశ్రీ అందించినట్లు సమాచారం. మహేష్‌బాబు పుట్టిన రోజైన ఆగస్ట్ 9న ఈ చిత్రం పాటలను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు వినికిడి.


Click it and Unblock the Notifications











