మహేష్ సినిమా కష్టమే అంటున్నారు

By Srikanya

హైదరాబాద్: మహేష్ వరసగా చిత్రాలు కమిటవుతున్నారు. అంతేకాక మహేష్ తో చిత్రం అంటూ రోజు కో వార్త అబిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేఫధ్యంలో గౌతమ్ మీనన్, మహేష్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే అది ఎంత వరకూ మెటీరియలైజ్ అవుతుంది అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి. దానికి కారణం ఇప్పటికే మహేష్ వరసగా కమిటైన చిత్రాలే. ఇప్పటికే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, సుకుమార్ చిత్రాలు చేస్తున్న మహేష్ మరో మూడు చిత్రాలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

దూకుడు కాంబినేషన్ రిపీట్ చేస్తూ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం, బిజినెస్ మ్యాన్ హిట్ ని కంటిన్యూ చేస్తూ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఓ చిత్రం, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కృష్ణా ముకుందా మురారి చిత్రం.. వరసలో ఉన్నాయి. అంటే ఈ మూడు సినిమాలు పూర్తయ్యే సరికి 2013 అయిపోతుంది. మరి గౌతమ్ మీనన్ అప్పటివరకూ ఉంటాడా...అనేది సందేహమే. ఎందుకంటే గతంలో గౌతమ్ మీనన్.. తెలుగులో చిత్రాలు ప్రకటించి ఉన్నారు. అవేమీ మెటిరియలైజ్ కాలేదు. దాంతో ఈ కాంబినేషన్ కష్టమే అంటున్నారు.

ప్రస్తుతం మహేష్ దృష్టి మొత్తం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంపై ఉంది. వెంకటేష్- మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోంది. మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. ఇక ఈ చిత్రం గురించి దిల్‌ రాజు మాట్లాడుతూ.. 25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీస్టారర్‌ ఇది. వెంకీ, మహేష్‌ అన్నదమ్ము లుగా నటిస్తున్నారు. సీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు.. అంటే కుటుంబం అన్నారు.

మరో ప్రక్క సుకుమార్ దర్శకత్వంలోనూ ఓ చిత్రం రెడీ అవుతోంది. 14 రీల్స్‌ సంస్థ ఈ చిత్రం నిర్మిస్తోంది. ఇందులో ఆయన ఆధునిక శైలిలో కనిపించబోతున్నట్లు సమాచారం. మారుతున్న ఫ్యాషన్స్‌కి అద్దంపట్టేలా మహేష్‌ రూపురేఖలు ఉంటాయని తెలిసింది. ఇప్పటి వరకూ ఆయన్ని చూడని కోణంలో కనిపిస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో చిత్ర హీరోతోపాటు, దర్శకుడు సుకుమార్‌ కూడా ప్రత్యేక దృష్టిపెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X