మహేష్ బాబు సినిమా కొత్త టైటిల్ ఏటంటే.....!?
శ్రీ కనకరత్న మూవీస్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సింగనమల రమేష్ బాబు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం మీకు తెలిసిందే. ఈ చిత్రానికి మొదటి నుంచి రకరకాల టైటిల్స్(కిలాడి, ఘనుడు) పరిశీలించిన దర్శకనిర్మాతలు చివరకు 'మగాడు" అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే వీరుడు మరియు మగాడు అనే టైటిల్ కూడా పరిశీలించి ఫైనల్ గా మగాడు టైటిల్ ఖరారు చేశారు. అయితే గతంలో మహేష్ నటించిన 'ఒక్కడు, అతడు, అతిథి, మురారి, పోకిరి" వంటి చిత్రాలు 3 అక్షరాలతో వచ్చి హిట్ కొట్టాయి. ఈ 3 అక్షరాల సెంటిమెంట్ మహేష్ కు కూడా బాగా వుండటంతో 'మగాడు" అనే టైటిల్ ను పైనల్ చేశారట దర్శక నిర్మాతలు.
మహేష్ బాబు సింగనమల రమేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రమేష్ బాబు మగాడు అనుష్క mahesh babu singanamala ramesh trivikram srinivas magadu anushka


Click it and Unblock the Notifications