మహేష్ బాబు ఫాలోయర్స్ పదివేలు పైనే...
ఓ వారం క్రితమే ట్విట్టర్ లో జాయిన్ అయిన మహేష్ బాబుకి ఫాలోయర్స్ పదివేలు దాటటం చాలా ఆనందంగా ఉందంటున్నాడు. తన మనసుకు నచ్చిన ప్రతీ విషయాన్ని ట్విట్టర్ లో పంచుకుంటున్న మహేష్ కి నెల దాటేసరికి లక్ష మెంబర్స్ యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఈ సోషల్ మీడియా నెట్ వర్క్ ద్వారా తన ఫ్యాన్స్ తో సంభాషించటం చాలా ఆనందంగా ఉందంటూ రీసెంట్ గా ట్వీట్ చేసారు. అలాగే చాలా గ్యాప్ తర్వాత అలీ తో సీన్ చేస్తున్నానని చాలా హ్యాపీ ఫీలవుతున్నానని మహేష్ తాజాగా రాసారు. ఇక శ్రీను వైట్లతో తను చేయబోయే సినిమా గురించి, కలేజా టైటిల్ గురించి, తన కొడుకు గురించి మహేష్ ఇప్పటికే ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఇక మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ చిత్రం చేస్తున్నారు. అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మహేష్ క్యాబ్ డ్రైవర్ గా నటిస్తున్నారు.
మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలేజా అనుష్క ట్విట్టర్ శ్రీను వైట్ల mahesh babu trivikram srinivas khaleja anushka twitter srinu vytla


Click it and Unblock the Notifications