»   » సూపర్ స్టార్‌కు సరైన నిర్వచనం.. 6 మిలియన్ల దాటేసిన మహేష్ ఫాలోవర్స్, ఆయన ఒక్కడినే !

సూపర్ స్టార్‌కు సరైన నిర్వచనం.. 6 మిలియన్ల దాటేసిన మహేష్ ఫాలోవర్స్, ఆయన ఒక్కడినే !

Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ అనే పదానికి మహేష్ బాబు సరైన నిర్వచనం. తన నటనతో మహేష్ కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. ఈ ఎవర్ గ్రీన్ అందగాడు హవా ఎటువంటిదో ఒక్కసారి సోషల్ మీడియా వైపు కన్నేస్తే తెలుస్తుంది. తనగా ట్విట్టర్ లో మహేష్ బాబు ఫాలోవర్స్ సంఖ్య 6 (60 లక్షలు) మిలియన్లకు చేరింది. మహేష్ కు అభిమానుల్లో ఉన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు మాట్లాడేది చాలా అరుదు. కానీ ట్విట్టర్ లో మాత్రం తన సినిమా కుటుంబ విషయాలని మహేష్ అభిమానులతో పంచుకుంటుంటాడు.

60 లక్షల ఫాలోవర్స్ సొతం చేసుకున్న మహేష్ మాత్రం కేవలం ఒక్కరిని మాత్రమే ట్విట్టర్లో ఫాలో అవుతుండడం విశేషం. తన బావ మరియు గుంటూరు ఎంపీ అయిన గల్లా జయదేవ్ ని మహేష్ బాబు ఫాలో అవుతన్నాడు. టాలీవుడ్ లో ఇంతమంది ఫాలోవర్స్ మరే స్టార్ కి లేరు.

Mahesh Babu followers crossed 6 millions

ఇదిలా ఉండగా మహేష్ బాబు కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఈనేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఏప్రిల్ 7 న భరత్ బహిరంగ సభ పేరుతో ఎల్బీ స్టేడియంలో భారీ ఈవెంట్ నిర్వహించాహడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

English summary
Mahesh Babu followers crossed 6 millions. This is rare feat from Telugu star
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X