మహేష్ ఆ ఒక్కరినే ఫాలో అవుతున్నాడు?
మహేష్ బాబు కేవలం జయ్ గల్లా (మహేష్ బావ) ఒక్కరినే ట్విట్టర్ లో ఫాలో చేస్తున్నారు. గల్లా జయ్ అమర్ రాజ బ్యాటరీస్ కి మేనేజింగ్ డైరక్టర్. ఇక మహేష్ కి రెండు లక్షలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు కానీ ఆయన కేవలం ఒక్కరినే పాలో అవటం ఆశ్చర్యపరిచే అంశం. అయితే ఆయన తన ఇమేజ్ ని వదులుకుని ఇంకెవరని పాలో చేస్తాడనేది కూడా ప్రశ్నే. అలాగే మహేష్ లాంటి సెలబ్రెటీలు మరొకరుని ఫాలో అవటం కూడా జరగని విషయమే. ఇక మహేష్ ప్రస్తుతం దూకుడు రిలీజ్ హడావిడిలో ఉన్నారు. ఆ చిత్రం సెన్సార్ అయ్యి ఈ నెల ఇరవై మూడవ తేదిన విడుదలకు సిద్దంగా ఉంది. ఇక ఈ చిత్రంలో మహేష్ అజయ్ అనే ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. సిన్సియర్, కోపం కలిసిన ఈ పోలీస్ అధికారి...ప్రశాంతి(సమంత)తో ప్రేమలో పడతాడు.
మరో పక్క తన తండ్రి ప్రత్యర్దుల చేతిలో దెబ్బతిని ఉంటాడు. దాంతో వారిపై రివేంజ్ తీర్చుకోవాలనకుని ఆయనకు ఉపశమనం కలిగించాలనుకుంటాడు. అందుకోసం అజయ్ ఏం చేసాడు అనేది కామిడీతో కలగపిన యాక్షన్ స్టోరీ. ఇక వినాయికుడు పేమ్ సోనియా ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది. అలాగే రక్త చరిత్ర ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్ గా కనపించి అలరిస్తాడు. బ్రహ్మానందం సినిమా చివరి దాకా ఉండి నవ్వులు పండిస్తాడు. అలాగే ఈ చిత్రంలో డైలాగులుకు ప్రత్యేకమైన శ్రద్ద పెట్టి రాసారు. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా, భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాది వంటి డైలాగులు అభిమానులు చేత టప్పట్లు కొట్టిస్తాయంటున్నారు.ఎప్పట్లాగే మాస్టర్ భరత్ ఈ చిత్రంలో ఓ విచిత్రమైన పాత్రలో కనిపించి నవ్వించనున్నారు.


Click it and Unblock the Notifications











