మహేష్ ఒక్కరిని, రామ్ చరణ్ ఏడుగురిని
ఏమిటీ ఒక్కటి, ఏడుగురు లెక్క అనుకుంటున్నారా..ఈ స్టార్ హీరోలు ట్విట్టర్ లో ఫాలో అయ్యే వ్యక్యుల సంఖ్య. వీళ్లిద్దరినీ లక్షల మంది అభిమానులు ఫాలో చేస్తూంటే..కేవలం మహేష్ ఒక్కరినే ఫాలో చేస్తారు. అలాగే రామ్ చరణ్ ..తన సర్కిల్ లోని ఏడుగురిని ఫాలో చేస్తాడు. వాళ్లెవరంటే...రాజ్ కుమార్ హిర్వాణి ,దలైలామా, సచిన్ టెండూల్కర్, శిరీష్ అల్లు, షాజన్ పదాంసి, రానా దగ్గుపాటి, జెనీలియా. ఇక మహేష్ బాబు ఫాలో అయ్యేది గల్లా జయ్ ఒక్కరిని మాత్రమే.
ఇక మహేష్ ప్రస్తుతం తన తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి అంటే జనవరి 13 వ తేదీన విడుదల అవుతున్న ఈ చిత్రం తన కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలుస్తుందని భావిస్తున్నాడు. క్రితం సంవత్సరం దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ ఈ సంవత్సరం బిజినెస్ మ్యాన్ తో బిజినెస్ అంచనాలును తారుమారు చేసేటట్లు ఉన్నారు. అలాగే రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయన తన దృష్టి మొత్తం తాజా చిత్రం రచ్చపైనే పెట్టారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తనకు పూర్తి యాక్షన్ ఇమేజ్ తెచ్చే మాస్ ఎంటర్టైనర్ గా నిలుస్తుందని భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











