బావ గల్లా జయదేవ్ తర్వాత కొరటాల శివ..... ఆశ్చర్య పరిచిన మహేష్ బాబు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ట్విట్టర్లో దాదాపు 6.32 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసి 8 సంవత్సరాలు అవుతోంది, ఇన్నేళ్ల కాలంగా కేవలం ఒకే ఒక్క వ్యక్తి ట్విట్టర్ ఖాతా మహేష్ ఫాలో అవుతూ వస్తున్నారు. అది మరెవరో కాదు మహేష్ బావ, ఎంపీ గల్లా జయదేవ్. ఇన్నేళ్ల తర్వాత మహేష్ బాబు ఫాలోయింగ్ లిస్టులో రెండో వ్యక్తికి అవకాశం దక్కింది. ఆ అవకాశం దక్కించుకుంది మరెవరో కాదు... 'భరత్ అనే నేను' చిత్ర దర్శకుడు కొరటాల శివ.

నేటి నుండే..., అంతా ఆశ్చర్యం
నిన్నటి వరకు మహేష్ బాబు తన బావ గల్లా జయదేవ్ ట్విట్టర్ ఖాతా మాత్రమే ఫాలో అవుతూ వచ్చారు. ఫాలోయింగ్ అనే దగ్గర చాలా ఏళ్లుగా 1 అంకె మాత్రమే కనిపిస్తూ ఉండేది. నేటి నుండి 2 అంకె కనిపిస్తుండటంతో.... ఎవరా రెండో వ్యక్తి? అంటూ అంతా ఆసక్తిగా క్లిక్ చేశారు. అక్కడ కొరటాల శివ అని ఉండటం చూసి అభిమానులు ఆశ్చర్య పోతున్నారు.

మహేష్ బాబుపై కొరటాల శివ ప్రభావం
ఇంతకు ముందు ‘శ్రీమంతుడు' చిత్రానికి మహేష్ బాబు-కొరటాల కలిసి పని చేశారు. ఇపుడు ‘భరత్ అనే నేను' చిత్రానికి కలిసి పని చేశారు. ఈ రెండు సినిమాల జర్నీలో దర్శకుడు కొరటాల శివపై మహేష్ బాబు ఒక మంచి అభిప్రాయానికి వచ్చారు. కొరటాల సినిమాల స్టైల్, ఆలోచన విధానం, సమాజం పట్ల తనకు ఉన్న బాధ్యతను సినిమాల రూపంలో చూపించడం లాంటి అంశాలు మహేష్ బాబుపై బాగా ప్రభావం చూపాయి.

రెండేళ్ల నుండి ఒత్తిడి, మళ్లీ కొరటాల శివ వల్లే రిలీఫ్
భరత్ అనే నేను హిట్ అయిన తర్వాత పెద్ద ప్రెజర్ రిలీవ్ అయిందని, రెండు సంవత్సరాలుగా తాను హిట్ లేక తీవ్రమైన ఒత్తిడి ఫీలవుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో పెద్ద హిట్టివ్వాలి అని ఉండేది. భరత్ అనే నేను సినిమా ఫలితం సంతోషాన్ని ఇచ్చింది. ఇందుకు శివ గారికి థాంక్స్ చెప్పుకోవాలి. ఆయన భరత్ క్యారెక్టర్ అంత బాగా డిజైన్ చేయడం, ప్రేక్షకులు నచ్చేలా స్క్రిప్టు రాసుకోవడం వల్లనే సినిమా ఇంత బాగా వచ్చింది అని మహేష్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గతంలో కూడా శ్రీమంతుడు లాంటి హిట్ ఇవ్వడం ద్వారా మహేష్ బాబును ప్లాపుల నుండి గట్టెక్కించారు కొరటాల.

మహేష్ బాబు మనకు దగ్గరైన కొరటాల
ఇటీవల సక్సెస్ మీట్‌లో కూడా మహేష్ బాబు భావోద్వేగంతో మాట్లాడారు. తనకు హిట్‌నిచ్చిన కొరటాల శివకు థ్యాంక్స్ చెబుతూ ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిద అంటూ హత్తుకున్నారు. తన మనసుకు కొరటాల ఎంతో దగ్గరయ్యారు కాబట్టే..... ఆయన్ను మహేష్ బాబు ఫాలో అవుతున్నారని చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











