నా ఫ్రెండ్, నా ప్రపంచం.... మహేష్ బాబు ఫ్రెండ్షిప్‌డే పోస్ట్ హాట్ టాపిక్
Recommended Video

ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మహేష్ బాబు చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది. తన జీవితంలో ది బెస్ట్ ఫ్రెండ్‌గా ఆయన ఒకే ఒక వ్యక్తిని సూచించారు. ఆ వ్యక్తి మరెవరో కాదు ఆయన జీవిత భాగస్వామి నమ్రత శిరోద్కర్. గతంలోనూ తన భార్య గురించి ఎమోషనల్‌గా సోషల్ మీడియాలో పలు పోస్టులు చేసిన సూపర్ స్టార్... ఫ్రెండ్షిప్‌డే సందర్భంగా తన జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ కూడా ఆవిడే అని చెప్పే ప్రయత్నం చేశారు.

నా ఫ్రెండ్... నా ప్రపంచం
నా ఫ్రెండ్, నా ప్రపంచం ఆవిడే... అంటూ నమ్రతతో కలిసి దిగిన ఓ పాత ఫోటోను ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులతో పంచుకున్నారు.

నమ్రత రియాక్షన్
మహేష్ బాబు పోస్టుపై నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘నేను కూడా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను' అని కామెంట్ పెట్టారు.

పెళ్లికి ముందే ఐదేళ్లు ఫ్రెండ్షిప్
నమ్రత శిరోద్కర్.... మహేష్ బాబుకు భార్య కాక ముందు మాజీ మిస్ ఇండియా, ప్రముఖ మోడల్. తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా ‘వంశీ'. ఈ సినిమా సమయంలోనే మహేష్ బాబుతో ఆమె పరిచయం స్నేహంగా మారింది. దాదాపు ఐదేళ్లు స్నేహం చేసిన అనంతరం వీరు పెళ్లి చేసుకున్నారు.

మహేష్ బాబుకు సపోర్టుగా
మహేష్, నమ్రత పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత నమ్రత మహేష్ బాబుకు ఫుల్ సపోర్టుగా నిలిచారు. ఆయన సూపర్‌స్టార్‌గా ఎదగడం వెనక ఆమె ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. నమ్రత కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకంతో పాటు తనకు సంబంధించిన పనులు కూడా పర్‌ఫెక్టుగా చూసుకుంటుంది కాబట్టే తాను ఏ టెన్షన్ లేకుండా షూటింగులు చేయగలుగుతున్నాను అని మహేష్ బాబు అనేక సందర్భాల్లో తెలిపారు.


Click it and Unblock the Notifications











