ఫోటోలు: మహేష్ ఫ్యామిలీ ప్యారిస్ టూర్.. సితార నాన్న కూచి అని ఒప్పుకోవాల్సిందే!
సూపర్ స్టార్ మహేష్ బాబు మొన్నటివరకు భరత్ అనే నేను చిత్రంతో బిజీగా గడిపాడు. ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. భరత్ అనే నేను చిత్రం షూటింగ్ పూర్తయ్యాక విడుదలకు ముందు మహేష్ తీరిక పడ్డాడు. దీనితో మహెష్ కు ఫ్యామిలీతో గడిపే అవకాశం వచ్చింది. భరత్ అనే నెను చిత్రం విడుదలకు కొద్దిరోజుల ముందు మహేష్ బాబు ఫ్యామిలీతో ప్యారిస్ టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్యారిస్ టూర్ లో మహేష్ పిల్లలతో సరదాగా గడిపిన దృశ్యాలని నమ్రత సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు కొద్దీ సమయంలోనే వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో మహేష్ కుమార్తె సితార క్యూట్ లుక్స్ అభిమానులని ఆకట్టుకుంటున్నాయి.

విజయ ఢంకా మోగించిన భరత్
భరత్ అనే నేను చిత్రాన్ని మహేష్ బాబు ప్రాణం పెట్టి మరీ చేశాడు. భరత్ అనే నేను చిత్రం చూసిన వారంతా మహేష్ నటన గురించే చెప్పుకుంటుండడం విశేషం. ముఖ్యమంత్రిగా మహేష్ బాబు కనబరిచిన నటన అద్భుతం. సందేశాన్ని, కమర్షియల్ అంశాలని దర్శకుడు కొరటాల సమపాళ్లలో రంగరించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

విడుదలకు ముందే
మహెష్ బాబు తన వృత్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో, కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు మహేష్ ప్రయత్నిస్తాడు. భరత్ అనే నేను చిత్రం విడుదలకు ముందే మహేష్ తన ఫ్యామిలీతో ప్యారిస్టూర్ వెళ్ళాడు.

సీతారాతో మహేష్ సందడి
మహేష్ బాబు ప్యారిస్ లో సీతారాతో గడుపుతున్న దృశ్యాల్ని నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు కొద్ది సమయంలోనే వైరల్ గా మారాయి. సితార క్యూట్ లుక్స్ అభిమానులని తెగ ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసాక సితార నాన్న కూచి అని ఒప్పుకోవాల్సిందే.

నమ్రత చెప్పినట్లుగానే
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ ఇంట్లో మహేష్, సితార సందడి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. వారిద్దరూ కలసి డాన్స్ కూడా చేస్తారట. ప్యారిస్ ఫోటోలు కూడా అదేవిధంగా ఉన్నాయి. మహేష్ తన ముద్దుల కుమార్తెని ఎంతలా గారాబం చేస్తాడో ఈ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది.

సోషల్ మీడియా ఏంజెల్
ఇప్పటికే సితార సోషల్ మీడియా ఏంజెల్ గా మారిపోయింది. నమ్రత సీతారాకు సంబందించిన ఫోటోలు, వీడియోలు వీలైనప్పుడల్లా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది.


Click it and Unblock the Notifications











