మహేష్ బాబుతో రవితేజ రేంజ్ లో పిచ్చకామెడి...!?
మహేష్ తో నెక్స్ ట్ సినిమా చేస్తున్న శ్రీను వైట్ల ఈ ప్రాజెక్ట్ చేయడం పట్ల చాలా ఎక్సైట్ అవుతున్నాడు. తన కెరీర్ లో ఇదో మైల్ స్టోన్ మూవీ అవుతుందని శ్రీను బలంగా నమ్ముతున్నాడు. ముఖ్యంగా మహేష్ ని తన స్టయిల్ లోకి మౌల్డ్ చేసుకుని అతనికో డిఫరెంట్ యాంగిల్ ఇస్తున్నట్టు శ్రీను వైట్ల చెప్పాడు. ఇంతదాకా మహేష్ ఏ సినిమాలోనూ పూర్తి స్థాయి కామెడీ చేయలేదని, దానిని తాను అనుకూలంగా మార్చుకుని మహేష్ చేత కామెడీ చేయించబోతున్నానని శ్రీను వైట్ల తెలిపాడు.
ఇప్పటివరకూ మహేష్ ని ఎవరూ అలా చూసి ఉండరు. ఈ సినిమాలో కొత్త మహేష్ ని చూస్తారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా మహేష్ సినిమాల్లో ఉండే యాక్షన్ కూడా ఇందులో చాలా బాగుంటుంది. మహేష్ కెరీర్ మరో సూపర్ హిట్ ఇవ్వాలనే కసితో ఈసినిమాకి వర్క్ చేస్తున్నాను" అని శ్రీనువైట్ల చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకి 'దూకుడు" అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రం వచ్చే వేసవికి విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత కథానాయికగా నటిస్తుంది.


Click it and Unblock the Notifications











