twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Super Star Krishna Death నటశేఖర కృష్ణ అంత్యక్రియలు ఎప్పుడంటే? ఘట్టమనేని ఫ్యామిలీ కీలక ప్రకటన

    |

    డేరింగ్, డాషింగ్, డైనమిక్, నటశేఖర కృష్ణ అస్తమయం అందర్నీ విషాదంలోకి నెట్టింది. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియల విషయాన్ని, ఇతర అంశాల గురించి ఘట్టమనేని ఫ్యామిలీ తరఫున కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటన వివరాల్లోకి వెళితే..

    తెర వెనుక కూడా సూపర్ స్టార్

    తెర వెనుక కూడా సూపర్ స్టార్

    కృష్ణ గారు ఇకలేరనే విషయాన్ని తెలియజేయడానికి చింతిస్తున్నాం. కేవలం స్క్రీన్ మీదే కాకుండా.. తెర వెనుక సూపర్ స్టార్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. వినయం, విధేయత, జాలి, దయాభావం, ప్రేమానురాగాలుకు ఆయన పెట్టింది పేరు. ఆయన నటించిన సినిమాలు, చేసిన సేవలతో ప్రతీ ఒక్కరి గుండెలో చిరస్థాయిగా మిగిలిపోతారు అని ఘట్టమనేని ఫ్యామిలీ తెలిపింది.

     అందుకే ఆయనను గొప్పగా..

    అందుకే ఆయనను గొప్పగా..

    కృష్ణ గారు ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన గొప్ప మహనీయుడు. అందుకే ఆయనను మేమేంతో గొప్పగా ప్రేమిస్తాం. ఆయన లేరనే విషయం ప్రతీ రోజు మాకు విషాదాన్ని పంచుతుంది. అందుకే మేము ఆయనకు గుడ్ బై చెప్పడానికి ఇష్టపడటం లేదు. ఆయన ఎప్పడూ మాతోనే ఉంటారు అని ఘట్టమనేని ఫ్యామిలీ తరఫున ప్రకటనను విడుదల చేశారు.

    నానక్ రామ్ గూడా నివాసంలో..

    నానక్ రామ్ గూడా నివాసంలో..

    కృష్ణ గారి పార్థీవ దేహాన్ని కాంటినెంటల్ హోటల్ నుంచి నానక్ రామ్‌ గూడలోని ఆయన నివాసానికి తరలిస్తారు. 4 గంటల వరకు ఆయన పార్థీవ దేహాన్ని అక్కడే సినీ ప్రముఖుల సందర్శనార్థం కోసం ఉంచుతారు. అనంతరం మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివదేహాన్ని ఉంచనున్నారు అని సినీ వర్గాలు వెల్లడింాయి.

    అంత్యక్రియలు ఎప్పుడంటే?

    అంత్యక్రియలు ఎప్పుడంటే?

    సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను బుధవారం మధ్యాహ్నం నిర్వహిస్తారు. అంతిమ సంస్కారాలను జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో గానీ.. లేదా ఆయన ఫామ్‌హౌస్‌లో గానీ నిర్వహించే అవకాశం ఉంది. దివంగత సినీ నటుడు కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

    English summary
    Super Star Krishna passed away due to Cardiac Arrest at the age of 80. Mahesh Babu's Gattamaneni Family Official statement on Super Star Krishna Last rites.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X