ప్రొడక్షన్ టీమ్ పై మండిపడ్డ మహేష్ బాబు...
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ లో జరిగిన అసౌకర్యం గురించి కోపంగా ట్విట్టర్ లో మహేష్ రాసుకొచ్చారు. "కృత్రిమ వర్షం కురిపించడం కోసం యూనిట్ వారు భారీ ఎత్తున నీళ్లు ఏర్పాటు చేశారు. భరించలేనంత వాసనతో ఆ నీళ్లు మురికిగా అగుపించాయి. దాంతో ఖంగు తిన్నాను' అని మహేష్ బాబు తాజాగా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలనే ఉద్దేశంతో యూనిట్‌లో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన సలహా మేరకు ఈ విధంగా చేశారని, ఈ కారణంగా నాలుగు గంటల సేపు షూటింగ్ కూడా ఆగిందని, వేల రూపాయలు పొదుపు చేయాలనుకుంటే ఇప్పుడు లక్షలు ఖర్చయ్యాయి అని, నిజంగా ఫూలిష్ గా ఉందని మహేష్ పేర్కొన్నారు. మంచి నీటి ట్యాంకర్లు ఎరేంజ్ చేశాకనే, మళ్లీ షూటింగ్ సజావుగా జరిగింది రాసుకొచ్చారు. ఇక ప్రొడక్షన్ ఖర్చు తగ్గిస్తూ దగ్గరుండి విషయాలు చూడటానికి నిర్మాత సి.కళ్యాణ్ ని ఈ చిత్రం నిర్మాత శింగనమల రమేష్ నియమించిన సంగతి తెలిసిందే. అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











