»   » మహేష్ బాబు యాడ్ సరదాగా ఉంది.... (వీడియో)

మహేష్ బాబు యాడ్ సరదాగా ఉంది.... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇటు సినిమాలతో ఎంత బిజీగా ఉంటో.... అటు వివిధ కార్పొరెట్ కంపెనీల యాడ్స్‌లో నటిస్తూ అంతే బిజీగా ఉంటారు. ఇలా ఓ వైపు రెండు చేతులా సంపాదిస్తున్న మహేష్ బాబు పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. హీల్ ఎ చైల్డ్ ఆర్గనైజేషన్ కి ఆర్ధికంగా తనవంతు సహాయం చేస్తున్నాడు.

రెయిన్‌బో హాస్పటల్ కు కూడా మహేష్ సహాయం అందుతోంది. మహేష్, అతని భార్య నమ్రత శిరోద్కర్ కలిపి ఛారిటీ కోసం ఓ అకౌంట్ మెయింటెన్ చేస్తూ ఈ సహాయ కార్యక్రమాలను చేస్తున్నారు. తాజాగా 'రెయిన్ బో హాస్పటల్స్'కు గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి అంగీకరించాడు మహేష్ బాబు.

'చిన్న పిల్లలకు సంబందించిన 'రెయిన్ బో' హాస్పటల్ కు అంబాసిడర్ గా వ్యవహరించడం ఆనందంగా ఉంది. ఇకముందు ఈ హాస్పటల్ నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం నా బాధ్యతగా ఫీలవుతున్నాను'' అని చెప్పాడు.

English summary
Mahesh Babu has agreed to be the good will ambassador for Rainbow Hospitals.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu