»   » కృష్ణ, మహేష్ బాబు, గౌతం కలిసి నటిస్తున్నారు...

కృష్ణ, మహేష్ బాబు, గౌతం కలిసి నటిస్తున్నారు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్య అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాలు నటులు ఏఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ కలిసి ‘మనం' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అందరూ ఒకే సినిమాలో కలిసి నటించడం, సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ హ్యాపీ ఫీలయ్యారు.

ఘట్టమనేని ఫ్యామిలీ నటులైన కృష్ణ, మహేష్ బాబు, గౌతం కలిసి నటించాలని అభిమానులు చాలా కాలంగా ఆశ పడుతున్నారు. ఎట్టకేలకు వారి ఆశ తీరబోతోంది. ఈ ముగ్గురు స్టార్స్ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీ శ్రీ' అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు, గౌతం గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారు.

Mahesh Babu, Goutham to play guest role in Krishna's Sri Sri movie

ఈ సినిమాలో కృష్ణ రెండో భార్య విజయ నిర్మల, విజయ నిర్మల తనయుడు నరేష్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత సూపర్ స్టార్ కృష్ణ లీడ్ చేస్తున్న సినిమా శ్రీ శ్రీ. స్వయంగా కృష్ణ మహేష్ బాబుతో మాట్లాడి ఆయన్ను ఒప్పించారట. అయితే ఈ విషయమై ఇంకా అపీషియల్ సమాచారం ఏమీ లేదు.

గతంలో దర్శకుడు ముప్పలలేని తాజ్ మహల్, రాజా, సంక్రాంతి లాంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన దర్శకత్వం చేస్తున్న ఈ సినిమా పగ ఎప్పటికి పాతది కాదు అన్న కథాంశంతో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

English summary
Tollywood super star Mahesh Babu, Goutham to play guest role in Krishna's Sri Sri movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu