క్రిష్ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్
దూకుడు మీద ఉన్న మహేష్ బాబు మరో కథను ఓకే చేసారు. వేదం, గమ్యం చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్న క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ఆయన కమిటయ్యారు. ఈ చిత్రం కథ,మహేష్ పాత్ర చాలా వాస్తవకింగా, ఇప్పటివరకూ మహేష్ చేయని రీతిలో బాడీ లాంగ్వేజ్ తో ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. అయితే సుకుమార్ తో మహేష్ చిత్రం ఫినిష్ అయ్యాక ఈ చిత్రం చేస్తారు. ఈ లోగా క్రిష్ కూడా రానాతో తాను 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రాన్ని పూర్తి చేస్తారు. ఈ సినిమాని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తారు.ఈ నెల 27 నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. హీరోయిన్ ఇంకా ఎంపిక చేయలేదు.
ఇక మహేష్ ప్రస్తుతం ప్రస్తుతం 'బిజినెస్‌మేన్' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం డైలాగుతో కూడిన టీజన్ ని విడుదల చేసారు. ఆ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక బిజెనెస్ మ్యాన్ అనంతరం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో నటిస్తున్నారు. మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో ఈ చిత్రం మల్టి స్టారర్ చిత్రంగా రూపొందనుంది. ఈ చిత్రం ఆల్రెడీ లాంచింగ్ జరిగింది. ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ ఐదున ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంతను ఎంపిక చేసారు.


Click it and Unblock the Notifications











