»   »  ఎన్టీఆర్ బయోపిక్‌లో మహేష్ బాబు కూడా నటిస్తున్నారు: శ్రీరెడ్డి

ఎన్టీఆర్ బయోపిక్‌లో మహేష్ బాబు కూడా నటిస్తున్నారు: శ్రీరెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ గురువారం నాచారంలోకి రామకృష్ణ స్టూడియోలో ప్రారంభం అయింది. ఈ చిత్రంలో రామారావు పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ కనిపించనున్నారు. తేజ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందులో గెస్ట్ రోల్ చేస్తున్నారట. ఈ విషయాన్ని నటి శ్రీరెడ్డి వెల్లడించారు. దర్శకుడు తేజ స్వయంగా తనతో ఈ విషయం చెప్పారని ఆమె తెలిపారు.

Mahesh Babu Guest role in NTR Biopic

కాస్టింగ్ కౌచ్ వ్యవహారంతో మీడియాకెక్కి సంచలనంగా మారిన శ్రీరెడ్డికి ఎన్టీఆర్ బయోపిక్‌లో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆనందాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటూ.... బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి గొప్ప యాక్టర్లు చేస్తున్న సినిమాలో తనకు అవకాశం దక్కడం హ్యాపీగా ఉందన్నారు. అయితే మహేష్ బాబు ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు అనేది హాట్ టాపిక్ అయింది.

'యన్‌.టి.ఆర్‌ ... అనే టైటిల్‌తో ఈ బయోపిక్ తెరకెక్కుతోంది. బాలకృష్ణ కూడా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. ఎన్‌.బి.కె.ఫిలింస్‌ బ్యానర్‌పై వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

నాచారంలోని రామకృష్ణ స్టూడియోలో జరిగిన బయోపిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో...... 'దానవీరశూరకర్ణ' సినిమాలో దుర్యోధనుడు గెటప్‌లో ఉన్న బాలకృష్ణపై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. తొలి సన్నివేశానికి ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు క్లాప్‌ కొట్టారు. తెలంగాణ మినిష్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా.. కె.రాఘ‌వేంద్రరావు, బోయపాటి శ్రీను తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. నంద‌మూరి మోహ‌న‌కృష్ణ‌, రామ‌కృష్ణ‌, సాయికృష్ణ స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అందించారు.

English summary
Sri Reddy conformed Mahesh Babu Guest role in NTR Biopic. The biopic on late actor-politician NT Rama Rao titled NTR went on the floors at Ramakrishna Studios in Hyderabad on Thursday. The event was attended by a slew of Telugu celebrities and Vice President M Venkaiah Naidu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X