పండగ మూడ్ లో ఉన్నా...మహేష్ బాబు
"ఓహ్...మా ఫ్యామిలీ అంతా పండగ మూడ్ లో ఉన్నాం. దానికి కారణం...నా సోదరి ప్రియ. తను మగబిడ్డకి జన్మనిచ్చింది. ప్రియాకి, మా బావ సుధీర్ కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను' అని మహేష్ బాబు ట్విట్టర్ లో తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ మధ్యకాలంలో మహేష్ బాబు ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను, తనకు ఎదురవుతున్న సంఘటనలను 'ట్విట్టర్'లో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రవిశేషాలను కూడా ట్విట్టర్ లో పొందుపరుస్తున్నారు. త్రివిక్రమ్ తో చేస్తున్న చిత్రంలో అనుష్క హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం తర్వాత మహేష్...శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయటానికి కమిట్ అయ్యారు. శ్రీను వైట్ల చిత్రానికి సమంతాని హీరోయిన్ గా చేస్తోంది.
మహేష్ బాబు శ్రీను వైట్ల త్రివిక్రమ్ శ్రీనివాస్ అతిధి సుధీర్ ప్రియ సమంతా ట్విట్టర్ mahesh babu trivikram srinivas athidi samantha priya twitter


Click it and Unblock the Notifications