twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ధాంక్స్ టు జగన్ గారూ..మహేష్ బాబు

    By Srikanya
    |

    "టెర్రఫిక్ రెస్పాన్స్ వచ్చింది.హీరోల క్యారెక్టరైజేషన్ లు చేయటంలో జగన్ గారు గురించి తెలిసిందే.అలాంటి క్యారెక్టైరైజేషన లో బిజెనెస్ మ్యాన్ లో బెస్ట్.ఈ సినిమాలో చేయటం నాకు గౌరవం.నేను నా కెరీర్ లో మేస్ట్ ఛాలింజింగ్ రోల్ ని ప్లే చేస్తున్నాను.కానీ అది చాలా ఈజీగా ఉంది.ధాంక్స్ టు జగన్ గారు.నేను జనవరి 11 వ తేదీ కోసం ఎదురుచూస్తున్నాను.ఆ రోజు మళ్లీ రాకింగ్" అన్నారు ట్విట్ట ర్ లో మహేష్ బాబు.

    ఇక పూరి జగన్ ఫస్ట్ లుక్ విడుదల చేసి మాట్లాడుతూ..బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్‌బాబు హీరోయిజాన్ని పతాక స్థాయిలో ఆవిష్కరిస్తున్నాం. మహేష్‌బాబు సూపర్ పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడు. 'పోకిరి" తర్వాత మహేష్‌తో చేస్తోన్న ఈ చిత్రం కొత్త చరిత్రను సృష్టిస్తుందని ఆశిస్తున్నాను"అన్నారు .

    సహ నిర్మాత వి.సురేష్‌డ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'ముంబాయ్ నేపథ్య కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ 8 లోగా చిత్రీకరణ పూర్తవుతుంది. నిర్మాణానంతర కార్యక్షికమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ రెండో వారంలో ఆడియోను విడుదల చేస్తాం. జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్‌లో ఆర్.ఆర్.ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమాని విడుదల చేస్తాం" అన్నారు.

    కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, షాయాజీషిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, అలీ, బ్రహ్మాజీ, భరత్‌డ్డి, రాజా తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, సినిమాటోక్షిగఫీ: శ్యామ్ కె నాయుడు, ఫైట్స్: విజయ్, నిర్మాత: వెంకట్, కథ-వూస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Mahesh Babu tweeted: "Response has been terrific. Jagan garu is known for his characterization of heroes in his films and Businessman is his best ever. It is an honor to be part of this film.I am playing one of the most challenging characters in my career but it all seemed so easy thanks to Jagan gaaru. I am waiting for Jan 11 to rock again," he added
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X