బిజినెస్ మ్యాన్ రీమేక్ లోనూ నేనే: మహేష్ బాబు
బిజినెస్ మ్యాన్ సూపర్ హిట్ టాక్ రావటంతో చాలా ఉత్సాహంగా ఉన్నారు మహేష్ బాబు. ఆయన ఈ చిత్రాన్ని బాలీవుడ్ రీమేక్ లోనూ నటించటానికి ఆసక్తి చూపెడుతున్నారు. మహేష్ ఈ విషయమై మాట్లాడుతూ..నేను బిజినెస్ మ్యాన్ చిత్రం రీమేక్ తో హిందీలో ప్రవేశించాలనుకుంటున్నాను. ఈ సబ్జెక్టు యూనివర్సిల్. ఇది ఇండియాలో అందరినీ కనెక్టు అవుతుంది అన్నారు. అయితే మీరు గ్యాగస్టర్ ప్లిక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఎందుకు అవ్వాలనుకుంటున్నరు అని మీడియా వారు అడిగితే..అక్కడ నాకు రెడీ మేడ్ గా ఆడియన్స్ లేరు. అలాంటప్పుడు మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న వెరైటీ రోల్ తో వెళ్లటం బెస్ట్. అలా చేస్తే క్యాపబుల్ యాక్టర్ గా అక్కడ కొనసాగవచ్చు అంటు తన మనస్సులో మాటను చెప్పారు.
గతంలో మణిరత్నం గురు ఆఫర్ ని వదులుకున్న మహేష్ ఈ సారి అలాంటి పని చేయదలుచుకోలేదు. బిజినెస్ మ్యాన్ హవాను దేశమంతటా కొనసాగించనున్నారు.అలాగే ఈ సంవత్సరమే ఈ సినిమాను హిందీలో చేయనున్నానని చెప్పారు. అలాగే పూరీ సైతం ఈ చిత్రాన్ని హిందీలో అభిషేక్ బచ్చన్ తో మొదట అనుకున్నా ఇప్పుడు చేయటానికి ఆసక్తి లేదని తేల్చేసారు. మహేష్ ఓకే అంటే హిందీలో చేస్తానని చెప్పారు. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రం ఓపినింగ్స్ భాక్సాపీస్ ని ఓ రేంజిలో కుదిపేసాయి. రెండు వేల ధియోటర్స్ లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ లో కొత్త రికార్డులను క్రియోట్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











