మహేష్ ఎక్కడికీ పారిపోలేదు....ఇక ఆ ప్రచారం ఆపండి!
హైదరాబాద్: మహేష్ బాబు ఉంటే షూటింగులో, లేక పోతే ఇంట్లో....ఈ రెండు చోట్ల లేడంటే ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో ఉన్నారని అర్థం. సినిమాలు, వాణిజ్య ప్రకటనలకు సంబందించిన కార్యక్రమాలతో బిజీగా ఉండే మహేష్ బాబు సమయం దొరికితే ఫ్యామిలీతో హాలీడే ఎంజాయ్ చేయడానికే ఆసక్తి చూపుతుంటారు.
ఎప్పటిలాగే ఇటీవల 'బ్రహ్మోత్సవం' విడుదలైన తర్వాత కూడా మహేష్ బాబు ఫ్యామిలీ వెకేషన్ ప్లాన్ చేసారు. సినిమా రిలీజ్ ముందు రోజు వరకు మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూలతో బిజీగా గడిపిన మహేష్ బాబు సినిమా రిలీజైన అనంతరం ఫ్యామిలీతో కలిసి యూకె వెళ్లారు.

సినిమా రిలీజ్ ముందే మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఈ వెకేషన్ ప్లాన్ చేసారు. అయితే 'బ్రహ్మోత్సవం' ప్లాప్ టాక్ రావడం, కలెక్షన్ల తీవ్రంగా పడిపోవడం, అదే సమయంలో మహేష్ బాబు వెకేషన్ వెళ్లడం లాంటివి చోటు చేసుకోవడంతో కొందరు దీన్ని నెగెటివ్ గా ప్రచారం చేసారు.
'బ్రహ్మోత్సవం తలనొప్పి నుండి తప్పించుకోవడానికే మహేష్ బాబు ఈ వెకేషన్ ప్లాన్ చేసారని, బ్రహ్మోత్సవం వల్ల నష్టపోన డిస్ట్రిబ్యూటర్లు గోల చేసే అవకాశం ఉండటంతో ఇలా చేసారు' అంటూ ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని, మహేష్ బాబు ఎక్కడికి పారిపోలేదని, సినిమా రిలీజ్ కంటే ముందే ఈ వెకేషన్ ప్లాన్ చేసారు, ఇలాంటి తప్పుడు ప్రచారం ఇప్పటికైనా ఆపండి అంటూ మహేష్ బాబు సన్నిహితులు అంటున్నారు.
బాధ్యత వహిస్తానని చెప్పిన మహేష్
'బ్రహ్మోత్సవం' విషయంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలదే తప్పని, ఆయన టీవీ సీరియల్ లాగ తీసారని, మహేష్ నమ్మి మోసపోయారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే రిలాక్సేషన్ కోసం ఫ్యామిలీతో కలిసి లండన్ కు వెళ్లిన మహేష్, వెళ్లేముందు తన టీమ్ తో ...తనే ఈ ఫ్లాఫ్ కు భాధ్యత వహిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు జూన్ 20న తిరిగి హైదరాబాద్ వస్తారు. వచ్చిన వెంటనే ఆయన మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూటింగులో జాయిన్ కాబోతున్నారు.


Click it and Unblock the Notifications











