టాలీవుడ్: హీరో ఆఫ్ ది ఇయిర్ 2011

By Srikanya

mahesh babu
ఈ సంవత్సరం ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా దూకుడు నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం మూవీ ఆఫ్ ది ఇయిర్ గానూ, అందులో చేసిన హీరో మహేష్ ని ..హీరో ఆఫ్ ది ఇయిర్ 2011 అంటున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేసింది. కామిడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఈ సంవత్సరం ఎక్కువ కలెక్టు చేసిన చిత్రంగా నమోదైంది. ఇక ప్రస్తుతం మహేష్ తన తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక మహేష్ బాబు దూకుడుతో పెరిగిన మార్కెట్ కు అణుగుణంగానే బిజినెస్ మ్యాన్ ఉండబోతోందని చెప్తున్నారు. అందులోనూ గతంలో మహేష్,పూరీ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి మెగా హిట్ ఫిలిం కావటంతో ఈ సినిమాపై మరింత అంచనాలు ఉన్నాయి. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ముంబై బ్యాక్ డ్రాప్ లో కథ నడవనుంది.

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో జనవరి 11న ఈచిత్రం విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే విడుదల తేదీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. దూకుడు ఆడియో మంచి విజయం సాధించటంతో అతన్నే ఈ సినిమాకు మహేష్ ఎంచుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నిమిత్తం వదిలిన ఫస్ట్ లుక్ ట్రైలర్ అందరి ప్రశంసలూ పొందుతోంది. ఎన్నో ఎక్సపెక్టేషన్స్ తో విడుదల అవనున్న ఈ చిత్రం సంక్రాంతి రేసులో విజేతగా నిలిచి దూకుడు రికార్డులను బ్రద్దలు కొడుతుందని మహేష్ ఫ్యాన్స్ సైతం ఆశలు పెట్టుకున్నారు. ఇక మహేష్ కి తెలుగు సహా తమిళ్‌లోనూ భారీ మార్కెట్‌ ఉంది. ముఖ్యంగా చెన్నైలో లో అతని వీరాభిమానులు ఉన్నారు. ఈ చిత్రాన్ని ఓవర్ సీస్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్క్రీన్ చేయనున్నారు. ఓవర్ సీస్ లో సెటిలైన తెలుగువారు కాని మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇదే మొట్టమొదటి సబ్ టైటిల్స్ తో వస్తున్న తెలుగు చిత్రం కావటం మరో రికార్డుగా అభివర్ణిస్తున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X