సాహసం: గాల్లో చక్కర్లు కొట్టిన మహేష్ బాబు, గౌతం..... (ఫోటోస్)

By Bojja Kumar

Recommended Video

వైరల్ అవుతున్న మహేష్ బాబు.. హాలిడే ట్రిప్ ఫోటోస్ !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఒమన్ దేశం వెళ్లిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడికి వెళ్లిన మహేష్ కుటుంబం న్యూ ఇయర్ వేడుకలు ముగిసిన అనంతరం అక్కడి అందమైన పర్యాటక ప్రాంతాల్లో విహరిస్తున్నారు. ఈ ట్రిప్పుకు సంబంధించిన ఫోటోలను నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు.

గాల్లో చక్కర్లు కొట్టిన మహేష్, గౌతం

గాల్లో చక్కర్లు కొట్టిన మహేష్, గౌతం

ఒమన్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన జిగ్గీ బేలో మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ గడిపారు. ఇక్కడి కొండ ప్రాంతాల్లో ప్యారా గ్లైడింగ్ చేస్తూ గాల్లో చక్కర్లు కొట్టారు. ఈ ఫోటోలను నమ్రత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

గౌతంకు ధైర్యం ఎక్కువే

గౌతంకు ధైర్యం ఎక్కువే

సాధారణంగా గౌతమ్ వయసు పిల్లలు ప్యారా గ్లైడింగ్ లాంటివి చేయడానికి భయపడతారు. అయితే గౌతమ్ మాత్రం ఎలాంటి భయం లేకుండా ప్యారా గ్లైడింగ్ చేశారు. ప్యారాగ్లైడింగ్ నిపుణుల సమక్షంలో మహేష్ బాబు, గౌతం ఈ సాహసం చేశారు.

మురిసిపోయిన నమ్రత

మురిసిపోయిన నమ్రత

గౌతమ్ తొలిసారిగా ప్యారా గ్లైడింగ్ చేయడంతో.... తన కొడుకు ఎదుగుదలను చూసి తల్లిగా నమ్రత మురిసి పోయింది. ‘గౌతమ్ ఫస్ట్ ప్యారాగ్లైడ్. మై లిటిల్ బేబీ ఆల్ గ్రో అప్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానించారు.

రిలాక్సింగ్ టైమ్

రిలాక్సింగ్ టైమ్

మహేష్ బాబు, గౌతమ్, సితార.... ఓమన్ హాలిడే ట్రిప్పులో ఎంజాయ్ చేస్తుంటే వారి ఆనంద క్షణాలను తనివితీరా ఆస్వాదిస్తూ తనలో తాను మురిసిపోతున్న నమ్రత. ఒక భార్యగా, తల్లిగా ఆమెకు ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది?

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ ఒమన్‌లో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మహేష్ బాబు

మహేష్ బాబు

ఒమన్ హాలిడే ట్రిప్పులో మహేష్ బాబు హ్యాపీ మూమెంట్స్.

మహేష్ బాబు సినిమాలు

మహేష్ బాబు సినిమాలు

మహేష్ బాబు 2017లో మురుగదాస్ దర్శకత్వంలో చేసిన ‘స్పైడర్' మూవీ బాకసాఫీసు వద్ద నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంపై మహేష్ ఫ్యాన్స్ భారీ హోప్స పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X