మహేశ్ చేసిన పనికి సినీ ప్రియుల ఆశ్చర్యం .. ఒకే ఒక్క దానితో మొత్తం చూపించాడు.!
వైవిధ్యమైన సినిమాల్లో అత్యుత్తమ నటనను కనబరిచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. అదే సమయంలో హ్యాండ్సమ్ లుక్కుతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం దక్కించుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ దూకుడును ప్రదర్శిస్తున్నాడు.
టాలీవుడ్‌లోనే బడా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న మహేశ్.. 'భరత్ అనే నేను', 'మహర్షి' వంటి సూపర్ హిట్ చిత్రాలను అందుకుని మాంచి ఉత్సాహంతో ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సూపర్ స్టార్ చేసిన పనికి సినీ ప్రియులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ మహేశ్ ఏం చేశాడు.? పూర్తి వివరాల్లోకి వెళితే..

మరో సక్సెస్ కోసం కలిశాడు
ప్రస్తుతం మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్నాడు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీని అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజయశాంతి, బండ్ల గణేష్, ప్రకాశ్ రాజ్, సంగీత, హరితేజ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ సంగీతం అందిస్తున్నాడు.

టాలీవుడ్‌లోనే ఇలా మొదటిసారి
‘సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇందులో భాగంగానే కొద్ది రోజుల నుంచి ఈ సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. అది కూడా ప్రతి సోమవారం మాత్రమే అని ప్రకటించారు. అంతేకాదు, ఇటీవలే సినిమా టీజర్ కూడా వదిలారు.

ఒక్కటి కాదు.. అన్నీ ఆకట్టుకున్నాయి
ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. అలాగే, విడుదలైన ప్రతి పాట, టీజర్ యూట్యూబ్‌లో భారీ స్థాయిలో వ్యూస్ సంపాదించుకుంటున్నాయి. అంతేకాదు, రెండు మూడు రోజుల పాటు ఆ సామాజిక మాధ్యమంలో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో ‘సరిలేరు'పై ప్రతి ఒక్కరిలో ఆసక్తి క్రమంగా పెరిగిపోతోంది.
అందులో కూడా పోటీ ఇవ్వాలని డిసైడ్
మహేశ్ బాబు అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరో. అయినప్పటికీ చాలా మంది స్టార్ హీరోల్లా ఆయన డ్యాన్స్ చేయలేడన్న అపవాదు ఉంది. దీన్ని అధిగమించేందుకు సూపర్ స్టార్ డిసైడ్ అయిపోయాడు. ఇకపై తనలో కూడా మంచి డ్యాన్సర్ ఉన్నాడని నిరూపించడంతో పాటు మిగిలిన వాళ్లకు పోటీ ఇవ్వాలని డిసైడ్ అయిపోయాడు.

మహేశ్ పనికి ఆశ్చర్యపోతున్న సినీ ప్రియులు
ఈ సినిమా కోసం మహేశ్ బాబు కష్టతరమైన స్టెప్పులను నేర్చుకుంటున్నాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘డాంగ్ డాంగ్' అంటూ సాగే పాటతో ఆ వార్తలు నిజమేనని నిరూపించాడు. ఇందులో వేసిన స్టెప్పులకు సూపర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ పాట ట్రెండ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











