కొడుకు టాలెంటు చూసి పొంగిపోయిన మహేష్ బాబు
హైదరాబాద్: సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన '1' చిత్రంలో మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో గౌతం చిన్ననాటి మహేష్ బాబుగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో నటించడం మాత్రమే కాదు...తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నాడు గౌతం.
ఏడేళ్ల వయసున్న గౌతం తన పాత్రకు లిప్ మూమెంట్ మిస్ కాకుండా పర్ ఫెక్టుగా...డబ్బింగ్ చెప్పడం యూనిట్ సభ్యులను ఆకట్టుకుంది. ముఖ్యంగా కొడుకు టాలెంటు చూసి మహేష్ బాబు ఎంతో ఇంప్రెస్ అయ్యాడు. ఈ విషయాన్ని దర్శకుడు సుకుమార్ వివరిస్తూ...గౌతం టాలెంటు చూసి మహేష్ బాబు చాలా సంతోష పడ్డాడు. ముఖ్యంగా డబ్బింగ్ చాలా బాగా చెప్పాడు. నటించేప్పుడు కూడా ఎక్కువగా రీటేకులు తీసుకోకుండా చేసాడు. సినిమాలో గౌతం పాత్ర ఎంతో కీలకం' అని వెల్లడించారు.
ఇంత చిన్న వయసు నుంచే తన టాలెంటు చూపుతున్న గౌతం పెద్దయ్యాక తండ్రికి తగిన తనయుడు అనిపించుకుంటారని '1-నేనొక్కడనే' యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇప్పటికే గౌతంపై గోవా, లండన్ తదితర ప్రాంతాల్లో సీన్లు చిత్రీకరించారు. సాధారణంగా మహేష్ బాబు సినిమా అంటేనే ఓ రేంజిలో అంచనాలుంటయి. పైగా సుకుమార్ దర్శకత్వం, గౌతం కృష్ణ తెరంగ్రేటం లాంటి అంశాలతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.


Click it and Unblock the Notifications












