‘అభిమన్యుడు’ చూసి మహేష్ బాబు ఇంప్రెస్.... విశాల్‌పై పొగడ్తలు!
విశాల్, అర్జున్ సారా, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం 'ఇరుంబు తిరై' తెలుగులో 'అభిమాన్యుడు' పేరుతో విడుదలై సూపర్ హిట్టయింది. ఇటు ఆడియన్స్‌తో పాటు అటు క్రిటిక్స్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం వసూళ్ల పరంగా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. చాలా కాలం తర్వాత విశాల్ మూవీ తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.
సినిమా కథతో పాటు విశాల్, అర్జున్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఇక సమంత తన ఆకట్టుకునే నటనతో పాటు అందంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా సాధారణ ప్రేక్షకులను మాత్రమే కాదు.... తెలుగు టాప్ స్టార్లను కూడా ఇంప్రెస్ చేసింది.
టాలీవుడ్ సూపర్ మహేష్ బాబుకు 'అభిమన్యుడు' చిత్రం బాగా నచ్చింది. సినిమా విజన్, డైరెక్షన్ చాలా బావుందని, తనకు ఎంతగానో నచ్చింది అంటూ విశాల్ అండ్ టీంను అభినందిస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ఆయన నటిస్తున్న 25వ చిత్రం షూటింగ్ ఇటీవలే ఉత్తరఖండ్‌లోని డెహ్రడూన్‌లో ప్రారంభం అయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











