మహేష్ బాబు మనసుకు నచ్చిన ‘సుబ్రమణ్యం’.. ది బెస్ట్ అంటూ ప్రశంసలు
విలక్షణ నటుడు రావు రమేష్ నటించిన మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటూ మంచి వసూళ్లను సాధిస్తున్నది. మోహన్ కార్య, బుజ్జి రాయుడు పెంట్యాల నిర్మాతలుగా పీబీఆర్ సినిమాస్, లోకమాతే సినిమాటిక్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. అయితే ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఇష్టాన్ని వ్యక్తం చేయడం విశేషంగా మారింది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే...
ఫ్యామిలీ ఎమోషన్స్, ఫన్‌తో మధ్య తరగతి జీవితాలను ప్రతిబింబించిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పించారు. అయితే ఈ సినిమాను ఇటీవల మహేష్ బాబు వీక్షించి తన అభిప్రాయాన్ని వెల్లడించడమే కాకుండా చిత్ర యూనిట్‌ను అభినందించారు.

తెలుగు సినిమా పరిశ్రమలో మంచి సినిమాలు ఇప్పుడు వచ్చినా.. ఎవరు తీసినా తన రివ్యూను ఇవ్వడం మహేశ్ అలవాటు. ఇటీవల ఈ మూవీని చూసిన వెంటనే రావు రమేష్‌ను వ్యక్తిగతం అభినందించారు. అలాగే ఎలాంటి అసభ్యత, అశ్లీలతకు చోటివ్వకుండా ఫ్యామిలీ అంతా చూసే విధంగా తీసిన యువ టీమ్‌పై ప్రశంసల్లో ముంచెత్తారు.
మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా గురించి మాట్లాడుతూ.. అద్బుతమైన వినోదాత్మక చిత్రం.. ప్రతీ సన్నివేశం ఫన్ రైడ్‌గా ఉంది. ఇటీవల వచ్చిన ఫ్యామిలీ చిత్రాల్లో బెస్ట్ అని టీమ్‌ను అభినందించారు. మహేష్ నుంచి ఇలాంటి ప్రశంసలు రావడంతో టీమ్ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

ఇక మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఓవర్సీస్‌లో సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకొంటున్నది. ఇప్పటికే ఈ సినిమా 80K డాలర్లు వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో సుమారుగా 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇంకా స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ వద్ద తనదైన శైలిలో కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications











