మలేషియాలో మహేష్‌ బాబుకు ఏం పని

By Srikanya

హైదరాబాద్ : మహేష్‌ హీరోగా మైత్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం మలేసియాలో చిత్రీకరణ జరుగుతోంది. మహేష్‌, శ్రుతి, జగపతిబాబు తదితరులపై ఈనెల 22 వరకూ అక్కడే కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారు.శ్రుతి హాసన్‌ హీరోయిన్. కొరటాల శివ దర్శకుడు. వై.నవీన్‌, రవిశంకర్‌, సి.వి.మోహన్‌ నిర్మాతలు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మహేష్‌బాబు సినిమా అంటేనే ఇంటిల్లిపాదీ చూసేలా ఉంటుంది. కుర్రకారుకి నచ్చే యాక్షన్‌, పెద్దవాళ్లని మెప్పించే భావోద్వేగాలూ, అందరూ ఇష్టపడే వినోదం... ఇలా దేనికీ లోటు చేయరు. ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే సందడి చేయనున్నారు.

'శ్రీమంతుడు' అనే పేరు పరిశీలనలో ఉంది. అయితే చిత్రబృందం ఇంకా అధికారికంగా ధ్రృవీకరించలేదు. అవును హీరోయిన్ పూర్ణ ఓ ప్రత్యేక గీతంలో కనువిందు చేయనుంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌, సుకన్య, ఆమని, సంపత్‌రాజ్‌, రాహుల్‌ రవీంద్రన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Mahesh Babu in Malaysia now

ఓవర్ సీస్ లో లీడింగ్ డిస్ట్రిబ్యూటర్స్ సౌత్ ఇండియన్ క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఓవర్ సీస్ లోనూ భారీగ ఈ చిత్రం విడుదల కానుంది.

నిర్మాతలు మాట్లాడుతూ...''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్‌ శైలికి తగ్గట్టుగా మాస్‌ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు . ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
శ్రీమంతుడు అనే టైటిల్ అనుకుంటున్న ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర ఓ ప్లే బోయ్ అని, బోర్న్ రిచ్ అని ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ సిటీ దాటని వాడు... ఓ గ్రామం ను దత్తత తీసుకుని..అక్కడ పరిస్దితులు చక్కబెడతాడని అంటున్నారు.

Mahesh Babu in Malaysia now

ఆ ఊరు పరిస్ధితులు బాగోలేక జనం ఖాళీ చేసి వెళ్లిపోతుంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్ధితుల్లో అక్కడికి ప్రవేసించిన మహేష్... ఆ ఊరుతో అనుబంధం పెంచుకుంటాడని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలో అక్క సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుందని అంటున్నారు. అయితే ఇది ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న ఊహాగానం మాత్రమే. ఎంతవరకూ నిజమో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, సుకన్య, అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X