రిలాక్స్ అవుతున్న మహేష్ బాబు.. వైరల్‌గా మారిన నమ్రత పోస్ట్
సినిమాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు బిజీగా ఉంటుంటే.. అందుకు సంబంధించిన వివరాలు చెబుతూ ఆయన సతీమణి నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఉంటుంది. అయితే దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో మహేష్ ఇంట్లోనే ఉండటంతో ఈ కరోనా సెలవులను ఆ కుటుంబం సరదాగా గడుపుతోంది. తాజాగా మహేష్ తాలూకు ఓ పిక్ చేసింది నమ్రత.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రాజ్యమేలుతుండటంతో.. ఈ వైరస్ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. హీరోలు, హీరోయిన్లు అంతా ఇంటికే పరిమితమై కుటుంబంతోనే పూర్తి సమయం గడుపుతున్నారు.

ఒక్కఓక్కరూ ఒక్కోరకంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ కోవలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రత, పిల్లలు సితార, గౌతమ్ లతో ఇంట్లోనే గడుపుతున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు ఇంట్లోనే సోఫాలో కూర్చొని రిలాక్స్ అవుతున్న పిక్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది నమ్రత.
ఇందులో మహేష్ యమ స్టైలిష్‌గా కనిపిస్తుండటంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' రూపంలో భారీ సక్సెస్ అందుకున్న మహేష్ బాబు.. మరికొద్ది రోజుల్లో పరశురామ్ తో సినిమా చేయబోతున్నారు.
View this post on InstagramA post shared by Namrata Shirodkar (@namratashirodkar) on


Click it and Unblock the Notifications











