సీఎం పోస్ట్‌పై మహేష్ కామెంట్స్.. రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలన్న సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు. టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ముందు వరుసలో ఉంటాడు సూపర్ స్టార్. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు మహేష్ బాబు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న మహేష్ బాబు.. త్వరలోనే మరో చిత్రానికి కొబ్బరికాయ కొట్టబోతోన్నాడు.

సరిలేరు సక్సెస్..
ఎఫ్2 చిత్రాన్ని తెరకెక్కించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన అనిల్ రావిపూడి.. మహేష్ బాబును డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని మలిచాడు. మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం.

హాలీడేలో సరదాగా..
సరిలేరు చిత్ర షూటింగ్‌లో నిర్విరామంగా పని చేసిన మహేష్ బాబు కేవలం ఐదు నెలల్లోనే షూటింగ్‌ను పూర్తి చేసేశాడు. సరిలేరు భారీ సక్సెస్ సాధించిన తరువాత విశ్రాంతి తీసుకోవాలని ఫిక్స్ అయిన మహేష్.. ఫ్యామిలీని తీసుకుని విదేశాలకు చెక్కేశాడు.న్యూయార్క్, దుబాయ్ వంటి నగర వీధుల్లో వీరు చేసిన సందడి సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే

రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి..
మహేష్ బాబు ఇటీవలె ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా.. ఒక్క రోజు సీఎం అయితే ఏం చేస్తారంటూ సదరు యాంకర్ ప్రశ్నించింది. తాను సీఎం అయితే రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని సరదాగా వ్యాఖ్యానించాడు. తన దృష్టంతా సినిమాలపైనేనని, రాజకీయాల గురించి తనకేమీ తెలియదని చెప్పుకొచ్చాడు.
Recommended Video


వారితో ట్రిప్‌కు..
వేరే హీరోలతో ట్రిప్‌కు వెళ్లాలనుకుంటే ఎవరితో వెళ్తారనే ప్రశ్నకు సమాధానంగా.. తారక్, రామ్ చరణ్, చిరంజీవి అంటూ సమాధానమిచ్చాడు. మహేష్ ప్రస్తుతం.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఈ మూవీలో మహేష్ బాబు.. గ్యాంగ్ స్టర్, లెక్చరర్ పాత్రను పోషిస్తున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











