మహేష్ బాబు ని ఎత్తేస్తున్న అనూష్క
మహేష్ బాబు గ్రేట్ కో స్టార్. అతను విపరీతమైన డెడికేషన్ ఉన్న వ్యక్తి. తన క్రాప్ట్ ని సమర్దవంతగా నిర్వహిస్తూంటాడు.ఆయన స్పాంటినిటీ, ఇప్రవైజేషన్ ఆశ్చర్యం కలిగిస్తూంటాయి. అలాగ మహేష్ బాబు నుండి చాలా నేర్చుకున్నా. అతనితో పనిచేయటం నా అదృష్టం..అంటూ ఓ రేంజిలో తన్మయంతో చెప్తూ మహేష్ బాబు ని ఎత్తేసుతోంది. అయితే చివరగా నేను అదృష్టవశాత్తుఇప్పటి వరకూ ప్రొఫెషనల్ హీరోలతోనే చేసాను అని మిగతా వారిని పనిలో పనిగా పొగిడింది. ప్రస్తుతం అనూష్క త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు బాబు సరసన చేస్తోంది. అలాగే ఈ చిత్రంలో నా పాత్ర కూడా చాలా డిఫెరెంట్ గా ఉంటుంది అంటోంది అనూష్క. అరుంధతి కి అవార్డులు పంట పండిన సందర్భంగా తనని కలిసిన మీడియా వారితో ఈ రకంగా చెప్పుకొచ్చింది.
అలాగే అరుంధతి గురించి మాట్లాడుతూ ఈ చిత్రం హిట్టయి నాకు బాధ్యతున పెంచింది. నేను చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. అయితే మరో సారి ఇట్లాంటి ఫిమేల్ ఓరియెంటడ్ రోల్ చేయాలనుంది అని మనస్సులో మాట బయట పెట్టింది. ఇక అరుంధతి హిట్టవటంతో ఆమె రేటు విపరీతంగా పెంచేసిందన్నదానని ఎప్పటిలాగే ఖండించిది. ఎవరూ తగిన రీజన్ లేనిదే ఖర్చుపెట్టరు. అయినా నేను మొదట నుంచీ స్క్రిప్టు కే ప్రాధాన్యత ఇస్తాను..చెక్ లు కన్నా అంటూ ముగించింది. ప్రస్తుతం ఆమె రవితేజ సరసన డాన్ శీను చిత్రంలో చేస్తోంది. అలాగే తకిట తకిట చిత్రంలో గెస్ట్ గా చేస్తోంది. అలాగే క్రిష్ ప్రతష్టాత్మకంగా రూపొందిస్తున్న వేదం చిత్రంలో వేశ్య పాత్రను చేస్తోంది.


Click it and Unblock the Notifications











