మహేష్ బాబు ఇడియట్ కాదు రాస్కేల్...!?
హిందీ సినిమా 'త్రీ ఇడియట్స్" తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించనున్నాడు. కాగా 'త్రీ ఇడియట్స్" టైటిల్ బాగా ఫేమస్ అయ్యింది కాబట్టి రీమేక్ వెర్షన్స్ కు ఈ టైటిల్ ను మార్చేయాలని శంకర్ అనుకుంటున్నాడట.
'త్రీ ఇడియట్స్" అని టైటిల్ పెడితే హిందీ సినిమానే గుర్తు చేసుకుని ఆ సినిమాతోనే ప్రేక్షకులు కంపేర్ చేస్తారని కూడా శంకర్ భావిస్తున్నాడట. ఈ నేపధ్యంలో ఈ సినిమాకి 'రాస్కేల్" అని టైటిల్ పెట్టాలనుకుంటున్నాడట. తెలుగు వెర్షన్ లో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు కాబట్టి 'రాస్కేల్" అనే టైటిల్ ను ప్రిన్స్ ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే. ఇదిలా వుండగా 'అల్లరి నరేష్" ని త్రి ఇడియట్స్ రీమేక్ కు శంకర్ ఎంపికచేసారని సమాచారం.
మహేష్ బాబు శంకర్ త్రీ ఇడియట్స్ రాస్కేల్ అల్లరి నరేష్ రోబో mahesh babu shankar 3 idiots rascal allari naresh robo


Click it and Unblock the Notifications