twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ తో సై అంటూ బాలీవుడ్ బ్యూటీ

    By Srikanya
    |

    ముంబై: మహేష్ బాబు ఎక్సట్రీమ్ గుడ్ లుకింగ్. నేను అతని ప్రక్కన ఏ ఆఫరైనా వస్తే అస్సలు వదులుకోను అంటోంది జరీన్ ఖాన్. జూ.కత్రినా కైఫ్ గా బాలీవుడ్ ముద్దుగా పిలుచుకునే ఈ ముద్దుగుమ్మ తను తరుచూ సౌత్ హీరోల సినిమాలు చూస్తూ ఉంటానని అంది. హిందీలోకి సౌత్ సినిమాలు డబ్బింగ్ అయి వస్తాయని,వాటిని చూడకుండా ఉండలేనని అంది. అలాగే హిందీ సినిమాలు సౌత్ రీమేక్ లు కూడా చేస్తానని,కథ మార్చి బాగా చేస్తారని మెచ్చుకుందామె.

    ఇక తెలుగు హీరోల్లో సిద్దార్దను..తాను రంగ్ దే బసంతి లో చూసానని క్యూట్ గా ఉంటాడని,కోలివుడ్ కింగ్ విజయ్ ఫెరఫార్మెన్స్ బాగుంటుందని,అతని సినిమాలు మిస్ చేయనని చెప్పుకొచ్చింది. విజయ్ సినిమాలన్నీ మాస్ ఎంటర్టైనర్స్ అని వాటిని తాను ఇష్టపడతానని అంది. బాలీవుడ్ లో ఆపర్స్ ఉన్నా సౌత్ లో చేయాలనే కోరిక ఉన్నట్లు తెలియచేసింది. అలాగే తను నటించిన హౌస్ ఫుల్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించటం తనకు ఆనందం కలగచేసిందని అంది. విక్రమ్ సరసన కమిటైన కర్సీ కరన్ చిత్రం ప్రస్తుతం పెండింగ్ లో పడిందని, ఏ క్షణమైనా తిరిగి ప్రారంభం అవుతుందని అంది.

    మోడలింగ్‌ చేస్తూ సల్మాన్‌ అండతో బాలీవుడ్‌ హీరోయిన్‌ అయిపోయింది 'వీర్‌' హిట్‌ కావడంతో జరీనాకి క్రేజ్‌ పెరిగింది. హాలీవుడ్‌ తెరను ఏలాలని, కోటీశ్వరి కావాలని కలలు కంటోంది జరీనా. ప్రస్తుతం ఆమె ఓ హాలీవుడ్ చిత్రం చేస్తోంది. అందులో ఆమె నగ్నంగా కనిపిస్తుందంటూ వార్తలు వినవస్తున్నాయి. ఇక మహేష్ ప్రస్తుతం వరస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు చిత్రం దాదాపు పూర్తి కావొచ్చింది.

    మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. వాస్తవానికి గతంలోనే ఈచిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. అయితే మరోవైపు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్న మహేష్ బాబు ఆ చిత్రం కోసం బల్క్ డేట్స్ ఇవ్వడంతో, పలు కారణాల వల్ల ఆ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడం తదితర కారణాలతో.... సుకుమార్ సినిమాకు ఇంతకాలం పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ సరసన క్రితి సానన్ అనే కొత్త అమ్మాయి అమ్మాయి ఎంపికైంది. ఇప్పటి వరకు మొడలింగ్ రంగంలో రాణిస్తున్న ఆమెకు ఇదే తొలి సినిమా అవకాశం. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

    English summary
    Zareen Khan would love to make her foray into the South. "I find Mahesh Babu extremely good-looking. I'll greedily grab any offer opposite him. Plus, he is the Tollywood heartthrob," she quips. Her love for T-town stars doesn't end there. "Oh I think Siddharth, who acted in Rang De Basanti is cute too. I also love watching Kollywood King Vijay perform... He is a total mass entertainer."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X