పోకిరి రికార్డ్స్ కొల్లగొట్టడానికి ‘దూకుడు’గా ఉన్న మహేష్
'దూకుడు" విడుదల కోసం అందరి లాగే నేనూ ఎదురు చూస్తున్నా. వచ్చేనెల సినిమా విడుదల కాబోతోంది. ఆరోజు అభిమానులందరికీ పండగే" అన్న మహేష్ మాటలు చూస్తుంటే 'దూకుడు" సినిమాపై మహేష్ బాబా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడనిపిస్తోంది. 'పోకిరి" సినిమా రషెస్ చూస్తున్నప్పుడే 'పెద్ద హిట్టు కొడుతున్నా" అంటూ పూరిని ఊరించిన మహేష్ బాబు మళ్ళీ అదే విధంగా దూకుడు సినిమాతో కొట్టబోతున్నానని గట్టిగా నమ్ముతున్నాడు.
ఇదే విషయాన్ని డైరెక్టర్ శ్రీను వైట్లతో చెబుతోన్న మహేష్ ఈసారి 'పోకిరి"ని సైతం పడగొట్టే హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అభిమానులైతే ఏకంగా మగధీరకే ఎసరు పెట్టాలని కోరుకుంటున్నారు. ఏదేమైనా అయిదేళ్లపాటు హిట్ లేకుండా గడిపేసిన మహేష్ బాబు ఈ సినిమాతో ఆలోటు తీర్చేసేటట్టే ఉన్నాడు. అందుకే ఆడియో ఫంక్షన్లకి దూరంగా ఉండేవాడు కూడా ఇప్పుడు ఆడియో వేడుకలో ఆనందంగా పాల్గొన్నాడు. సెన్స్, లాజిక్ లేకపోయినా, ఎంటర్ టైన్ మెంట్ తో హిట్లు కొట్టడం బాగా తెలిసిన శ్రీనువైటల్ డైరెక్షన్ కావడంతో 'దూకుడు" సినిమాపై అంచనాలు బాగనే వున్నాయి. అందునా రెండేళ్ళకు తక్కువ కాకుండా సినిమా చేసే మహేష్ తో ఏడాదికి కాస్త అటూ ఇటుగా సినిమా పూర్తి చేసేశాడు శ్రీనువైట్ల.


Click it and Unblock the Notifications











