మహేష్ ఛీఫ్ గెస్ట్ గా ఆ ఆడియో ఫంక్షన్
తన సినిమాల పంక్షన్స్ కే పెద్దగా హాజరు కాని హీరో మహేష్ బాబు. అయితే ఇప్పుడు మరో చిత్రం ఆడియో పంక్షన్ కి ఛీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నాడు. తన బావమరిది సుధీర్ బాబు హీరోగా చేస్తున్న 'ఎస్‌ఎంఎస్' చిత్రం ఆడియో ఫంక్షన్ కి మహేష్ రానున్నారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హాజరుకానున్న ఈ పంక్షన్ జనవరి 22 న శిల్ప కళా వేదిక లో జరగనుంది. సుధీర్ ఇంతకుముందు ఏమి మాయ చేసావే చిత్రంలో సమంతకు బ్రదర్ గా చేసాడు. 'ఎస్‌ఎంఎస్' అంటే 'శివ మనసులో శృతి'. సూపర్‌గుడ్ ఫిలింస్ ఆర్‌బీ చౌదరి సమర్పణలో వేగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్, హనీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విక్రమ్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ 'ఇటీవల దుబాయ్‌లో జరిగిన చివరి పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తయింది. అన్ని వర్గాలను అలరించే ఈ ప్రేమకథలో కుబుంబ భావోద్వేగాలు కూడా మేళవించి దర్శకుడు చిత్రాన్ని చక్కగా రూపొందించాడు. తప్పకుండా సుధీర్ ఈ చిత్రంలో మంచి కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకుంటాడు' అన్నారు. కసంద్ర, రోహిణి, సుబ్బరాజు, చంటి, వెన్నెల కిషోర్, హేమంత్, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సెల్వ గణేష్, సినిమాటోక్షిగ్సఫీ: చిట్టిబాబు, మాటలు: నంద్యాల రవి.


Click it and Unblock the Notifications











