మహేష్ బాబు పక్కనైతే ఆ భామ నటిస్తుందట
హైదరాబాద్: తెలుగు సినిమాల్లో తిరిగి తాను నటిస్తానని అంటూనే మహేష్ బాబు పక్కనైతే నటించడానికి తనకు అభ్యంతరం లేదని అంటోంది బాలీవుడ్ భామ కంగనా రనౌత్. ఇటీవల ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ మాట అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మహేష్ బాబు ప్రతిభ గలవాడే కాకుండా, పాపులర్ కూడా అని ఆమె అన్నది.
ఇటీవల ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులు తిరిగి తెలుగులో నటిస్తారా అంటూ ప్రశ్నించారు. మరో తెలుగు సినిమా చేయడాన్ని తాను ఇష్టపడుతానని, అయితే తనకు ఇప్పటి వరకు ఏ విధమైన ఆఫర్లూ రాలేదని నిజాయితీగానే చెప్పింది.
తనకు ఆఫర్ వస్తే, అది మహేష్ బాబు పక్కనైతే నటించడానికి తనకు ఎంతో ఇష్టంగా ఉంటుందని ఆ భామామణి తన మనసులోని మాటలను చెప్పింది. ఇంతకు ముందు కంగనా రనౌత్ ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ సినిమాలో నటించింది.
మహేష్ బాబు ప్రస్తుతం 1 నేనొక్కడినే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఆడియో కూడా ఇటీవలే విడుదలైంది. ఆ సినిమా జనవరి 10వ తేదీన విడుదలవుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications












