సమంతను దూరం పెడ్తున్న మహేష్ బాబు
తన చిత్రం దూకుడులో హీరోయిన్ గా చేస్తున్న సమంతను గత కొద్ది రోజులుగా దూరంగా ఉంచి రిజర్వ్ డ్ మహేష్ బాబు ఉంటున్నాడని వినికిడి.దీనికి కారణం మహేష్ బాబుకి, సమంత కు మధ్య ఎఫైర్ లాంటిది నడుస్తోందంటూ కొన్ని గాసిప్స్ రావటమే కారణని తెలుస్తోంది.ఇన్నాళ్ళూ క్లీన్ చిట్ తో మిస్టర్ ఫెరఫెక్ట్ లా ఉన్న మహేష్ కి ఈ విషయం తెలిసి ఆమెకు దూరంగా ఉండటమే మేలని నిర్ణయించుకున్నాడని చెప్తున్నారు.అందుకనే దూకుడు ఆడియో ఫంక్షన్ లో సైతం నమ్రత,మహేష్ లకు దూరంగా సమంత కూర్చుని ఉందని అంటున్నారు.హీరోయిన్ తో ఉండే రిలేషన్ తన పర్శనల్ జీవితంపై పొరపాటున కూడా పడకూడదని మహేష్ నమ్మే ఇలా చేస్తున్నాడంటున్నారు.
ఇక దూకుడు చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రంలో ఈ జంట మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని చెప్తున్నారు. దూకుడు చిత్రం ఆడియో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఆడియో టీజర్స్, ట్రైలర్స్ మంచి టాక్ తెచ్చుకున్నాయి. పోకిరి రేంజి హిట్ ని అభిమానులు ఎక్సపెక్ట్ చేస్తున్నారు. కామిడీ, యాక్షన్ కలబోసిన చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత అందచందాలు హైలెట్ అవుతాయంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. తమన్ ఇప్పటికే పాటల కంపోజింగ్ పూర్తి చేశారు. దూకుడు పాటలు తన గత సినిమాల్లో కెల్లా బెస్ట్ పాటలుగా నిలుస్తాయని మహేష్ తన ట్వట్టర్ రాసుకున్నాడు.


Click it and Unblock the Notifications











