ప్రిన్స్ మహేష్ దూకుడు కూడా పోకిరి లాగా హిట్ కొట్టడం కోసమే అలా..
ఇటీవల కాలంలో కందిరీగ షూటింగ్ సమయంలో హైదరాబాద్, చెన్నై ఫైటర్ల మధ్య నెలకొన్న వివాదం అందరికి తెలిసిందే. ఈవివాదాన్ని పరిష్కరించడానికి నిర్నాతమండలి సభ్యలు అందరూ కలసి మాట్లాడుకోవడానికి రావాల్సిందిగా వాళ్శను ఆహ్వానించడం దానిని పైటర్లు నిరాకరించడం తెలిసిందే. హైదరాబాద్, చెన్నై ఫైటర్ల మధ్య నెలకొన్న వివాదం కాస్తా దిశ మారి, నిర్మాణ వ్యయం అదుపుపై చర్చకు దారితీసింది. దాంతో సోమవారం రాత్రి ఓ రాత్రి ఓ హోటల్లో హీరోలు, దర్శకులు, నిర్మాతలు రహస్యంగా సమావేశమయ్యారు.
కార్మిక సంఘంతో నెలకొన్న వివాదంపై కన్నా, నిర్మాణ వ్యయం అదుపు పైనే ఇక్కడ ఎక్కు వ చర్చించారని తెలిసింది. నిర్మాణ వ్యయం తగ్గించేందుకు హీరోలు, దర్శకులు సముఖుత వ్యక్తం చేసినట్లు సమాచారం. చిత్ర సీమలో జరిగే వేడుకలకు, ఇటువంటి సమావేశాలకు చాలా దూరంగా ఉండే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఈ సమావేశానికి వచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ మేరకు ఏం చర్యలు తీసుకోవాలో సూచించడానికి కేఎల్ నారాయణ, శ్యాంప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ లతో ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ పరిస్థితిని పరిశీలించి మూడు రోజుల్లో తగిన సూచనలను నిర్మాతల మండలికి, దర్శకులకు అందజేస్తుంది.
ఇది తెలుసుకున్న మహేష్ బాబు తన తాజా చిత్రం దూకుడు బడ్జెట్ కితగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం. గతంలో కూడా కమర్షయల్ సినిమాలుగా విడుదలైనటువంటి సైనికుడు, అతిధి, ఖలేజా బాక్సాఫీసు వద్ద బోర్లా పడిన విషయం కూడా తెలిసిందే. ఏదో ఒక మోస్తారుగా డబ్బులు ఖర్చుపెట్టినటువంటి పోకిరి మాత్రం ప్రిన్స్ కుమాత్రం బాక్సాఫీసు రికార్డుల్ని బద్దలు కోట్టి డెబ్బై సంవత్సరాల చరిత్రను తిరగరాసింది. ఇప్పుడు సూపర్ స్టార్ ప్రిన్స ఏమనుకున్నాడో ఏమోగాని తన తాజా చిత్రం దూకుడుకి కూడా బడ్జెడ్ ఎక్కవగా కాకుండా, పరిమితంగా ఖర్చు చేయిస్తున్నాడని ఫిలింసిటీ వర్గాల సమాచారం.
దూకుడు సినిమా ప్రిన్స్ సోంత బ్యానర్ కానప్పటికి ఇలా చేయడం వల్ల నిర్మాతలు మాత్రమే కాకుండా మహేష్ అభిమానులు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక ఈసినిమాకి దర్శకుడుగా శ్రీనువైట్ల చేస్తున్న విషయం అందరికి తేలిసిందే. సమంత హీరోయిన్ గాచేస్తున్న ఈసినిమా ఇటీవలే టర్కీ లోషెడ్యూల్ పూర్తిచేసుకోని హైదరాబాద్ కుతిరిగివచ్చారు. ఈసినిమా సూపర్ స్టార్ ప్రిన్స్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











