ఏ తెలుగు చిత్రానికి రాని షేర్ 'మహేష్ ఖలేజా' కే సొంతం!?
'మహేష్ ఖలేజా' చిత్రం మొదటి యావరేజ్ అన్నా తర్వాత ఫ్లాప్ గా సెటిల్ అయిన సంగతి తెలిసిందే. అంతటా ఈ టాక్ వచ్చి ఫిక్సయిన ఈ తరుణంలో ఈ చిత్రం యాభై రోజులు ఘనంగా పూర్తి చేసుకుందంటూ నిర్మాతలు మీడియా సమావేశం ఏర్పాటు చేయటం అంతటా టాపిక్ గా మారింది. ఈ సందర్బంగా నిర్మాతల్లో ఒకరైన సి.కల్యాణ్ మాట్లాడుతూ "విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన ఓపెనింగ్స్‌తో 50 రోజుల్ని పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులు, అభిమానులకు కృతజ్ఞతలు చెబుతున్నాం.సినిమాలో మహేష్‌బాబు పెర్ఫార్మెన్స్ హైలైట్ అని ప్రేక్షకులంతా ప్రశంసించారు. ఓవర్సీస్‌లో ఏ తెలుగు చిత్రానికీ రాని అద్భుతమైన షేర్స్ 'మహేష్ ఖలేజా'కు రావడం విశేషం" అని అన్నారు. మహేష్, అనుష్క జంటగా త్రివిక్రమ్ రచన, దర్శకత్వంలో విడుదలైన చిత్రం 'మహేష్ ఖలేజా'. ఎస్.సత్యరామమూర్తి సమర్పించారు. శింగనమల రమేష్‌బాబు, సి.కల్యాణ్ నిర్మాతలు. కనకరత్న మూవీస్ పతాకంపై నిర్మించారు. ఈ నెల 25కి ఈ సినిమా 50 రోజుల్ని పూర్తి చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











