మహేష్ బాబు అన్నింటిలోనూ తికమక..మకతిక...!?
'ఖలేజా" విషంయలో ఎందుకనో మొదట్నుంచీ అంతా తికమకే. ఒక హీరోయిన్ని అనుకుని మరో హీరోయిన్ ను తీసుకోవడం, ఒక ఫైట్ మాస్టర్ అనుకుని మరో ఫైట్ మాస్టర్ ను పెట్టుకోవాల్సి రావడం, ఒక సినిమాటోగ్రాఫర్ తో కొన్నాళ్లు పినిచేయించుకున్నాక, మరో సినిమాటోగ్రాఫర్ ను తీసుకోవాల్సిరావడం..ఇలా అన్నిట్లోనూ తికమకే. ఈ తికమకను బేస్ చేసుకుని సినిమాలో ఒక పాట పెడితే బాగుంటుందనే 'ఐడియా" వచ్చింది చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు.
రాజు తలచుకుంటే అన్నట్లుగా దర్శకుడు తలచుకుంటే..సినిమాలోని పాట ఎలా కావాలంటే అలా వస్తుంది కాబట్టి..ఇంకాస్త వెరైటీగా తికమక సైతం తికమక పడేలా..తికమకను తిరగేసి 'మకతిక మాయా మశ్చీంద్ర...మనసిక మస్తీ కిష్కింద" అనే పాటను రాయించాడు. ప్రస్తుతం ఈ పాట హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ పాటతో సినిమా మొత్తం పూర్తవుతుంది. 'కొమరం పులి" విడుదల విషయంలో స్పష్టత వచ్చేసినందున..రెండు మూడు వారాల్లో ఈ చిత్రం ఆడియో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications