మహేష్ సినిమాఐతే ఫట్ అయిందికానీ పాటమాత్రం సూపర్ హిట్ అయింది...
'ఖలేజా" సినిమా ఈ ఏడాది బీభత్సమైన ప్లాప్ సినిమాల్లో ఒకటిగా మిగిలిపోయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వచ్చిన మహేష్ సినిమా 'ఖలేజా" అభిమానుల్ని ఓ రేంజ్ లో నిరాశను మిగిల్చిందన్నది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఫట్టైనా, ఈ ఏడాది బెస్ట్ సాంగ్స్ లో మాత్రం టాప్ ప్లేస్ కొట్టేసింది 'ఖలేజా" సినిమాలోని 'సదాశివా" పాట.
మొదట ఇదేదో పురాణకాలం నాటి పాట..అనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమయినా, తర్వాత్తర్వాత చిన్న పిల్లలు సైతం ఈజీగా హమ్ చేసేశారు. ఎఫ్ ఎం రేడియోల్లోనూ, బుల్లితెరపైనా..ఓరేంజ్ లో మార్మోగింది 'సదాశివ" పాట. మొబైల్ లో రింగ్ టోన్లు, కాలర్ ట్యూన్లు విషయంలోనూ 'సదాశివా" తనదైన హవా క్రియేట్ చేసింది. దీనంతటికీ కారణం సినిమా కన్నా ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ పై పోకస్ పెట్టడమే అని లేటు గా తెలుసుకున్నా గతంలో చేసిన పొరపాట్లు చేయనంటూ వరుసగా సినిమాలకు కమిట్ అవుతోన్న మహేష్, 'దూకుడు" సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు.
కాగా 2011లో ఎలాగైనా రెండు సినిమాలు రిలీజయ్యేలా చూసుకుంటాననీ, వీలైతే మూడో సినిమా కూడా రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుంటానంటోన్న మహేష్, ఈ ఏడాది సూపర్ హిట్ అయిన సాంగ్స్ లో 'సదాశివ" పాట ఉండడం చాలా ఆనందాన్నిస్తోందంటున్నాడు.


Click it and Unblock the Notifications











