ఆ సాంగ్ లో అంత 'ఖలేజా' లేదు.. మళ్లీ ట్యూన్ చేయండి...
ఫ్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం ఖలేజా టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. అయితే ఓ పాట చిత్రీకరణ విషయంలో మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ రాజీ పడటం లేదు. సిట్యువేషన్ కు తగ్గట్టు గా ట్యూన్ రాలేదని సంగీత దర్శకుడు మణిశర్మకు మళ్లీ మళ్లీ పనిపెడుతున్నట్లు భోగట్టా. మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతి సన్నివేశాన్ని ఎంతో సీరియస్ గా తీసుకుని తెరకెక్కించినట్లు సమాచారం.
కాగా ఈ చిత్రానికి నిర్మాతలు సి. కల్యాణ్, సింగనమల రమేష్ లు. త్వరలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాతలు వెల్లడించారు.
మహేష్ బాబు అనుష్క ఖలేజా సి. కల్యాణ్ సింగనమల రమేష్ mahesh babu anushka khaleja c kalyan singanamala ramesh


Click it and Unblock the Notifications