‘శబ్దాలయా స్టూడియోస్’లో బిజిగా వున్న మహేష్ బాబు
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సి.కళ్యాణ్ సమర్పణలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సింగనమల రమేష్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ప్యాచ్ వర్క్ మినహా మొత్తం పూర్తైంది. ఈ చిత్రానికి 'ఖలేజా" అన్న వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉన్నా మహేష్‌తో సహా అందరూ ఆ వార్తల్ని ఖండించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'సారధి" గా ప్రచారం జరిగింది.
ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను ఈరోజు నుంచి 'శబ్దాలయా స్టూడియోస్"లో ప్రారంభం కానున్నాయి. ఆగస్టు నెల ప్రధమార్ధంలో విడుదలయ్యే అవకాశాలున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు, నిర్మాత ప్రకాష్ రాజ్ ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. అలాగా అనుష్క కూడా ప్రధాన ఆకర్షనగా కనిపించనుంది.ఈ సినిమా టైటిల్ అధికారికంగా ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
మహేష్ బాబు అనుష్క ఖలేజా సారధి ప్రకాష్ రాజ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సింగనమల రమేష్ mahesh babu anushka khaleja saradhi prakash raj trivikram srinivas singanamala ramesh


Click it and Unblock the Notifications