మహేష్ ముద్దు మహిమే అంటున్న హీరోయిన్!
హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని తెలుగు సినీ పరిశ్రమలోని ప్రతి హీరోయిన్ కోరుకోవడం సహజమే. అలాంటి పెద్ద స్టార్‌తో చేసి ఒక్క హిట్టు కొట్టినా చాలు తమ రేంజి పెరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే మహేష్‌తో నటించే అవకాశం అంత ఆషామాషీగా రాదు. వస్తే ఒక రకంగా అదృష్టమే అని భావిస్తుంటారు.
కొందరైతే ఆయనతో క్లోజ్‌గా మూవ్ అయి అవకాశాలు కొట్టేదామని ప్రయత్నించి విఫలం అయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే హీరోయిన్లకు ఆమడ దూరంలో ఉంటాడు మహేష్. ఇప్పటికే ఓ హీరోయిన్(నమ్రతా శిరోద్కర్)కు క్లోజ్‌గా మూవ్ అవడం పెళ్లికి దారి తీసిన నేపథ్యం కూడా మహేష్ హీరోయిన్లకు ఆమడ దూరం ఉండటానికి ఓ కారణం అయి ఉండవచ్చేమో!
అయితే ఓ హీరోయిన్ మాత్రం మహేష్ బాబు ముద్దు మహిమ వల్లనే తాను ఈ స్థాయికి ఎదిగానని చెబుతోంది. ఆమె ఎవరోకాదు 'మనసారా', 'మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటించిన శ్రీదివ్య. అసలు ఆమె మహేష్ సరసన ఒక్క సినిమా కూడా చేయలేదు ముద్దు ఎలా పెట్టించుకుందనేగా మీడౌట్.
అసలు వివరాల్లోకి వెళితే...మహేష్ బాబు నటించిన 'యువరాజు' చిత్రంలో శ్రీదివ్య చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. షూటింగ్ సమయంలో కెమెరా ముందు నటించడానికి కాస్త భయపడిన శ్రీదివ్యను ఎత్తుకుని ముద్దుపెట్టుకుని ధైర్యం చెప్పాడట మహేష్ బాబు. మహేష్ బాబు ముద్దు మహిమ వల్లనే తాను ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగానని అంటోంది ఈ భామ. మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు సక్సెస్ మీట్లో శ్రీదివ్య ఈ వ్యాఖ్యలు చేసింది.


Click it and Unblock the Notifications












