»   »  మహేష్ బాబు, కొరటాల శివ చిత్రం ముహూర్తం ఖరారు!

మహేష్ బాబు, కొరటాల శివ చిత్రం ముహూర్తం ఖరారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahesh Babu-Koratala film confirmed for July
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, 'మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ పతాకంపై ఎర్నేని నవీన్, ఎలమంచిలి రవి శంకర్, సివిఎం సంయుర్తంగా ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ముహూర్తం ఖరారైంది. జులై నెలలో ఈచిత్రం ప్రారంభించాలని నిర్ణయించారు.

ప్రస్తుతం కొరటాల శివ పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. త్వరలో చిత్రానికి సంబంధించిన హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు. ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కించేందుకు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు.

వాస్తవానికి ఈచిత్రాన్ని తొలుత యూటీవీ సంస్థ వారు నిర్మించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం మైత్రి మూవీస్ చేతికొచ్చింది. UTV ప్రొడక్షన్ హౌస్ వారు చాలా కండీషన్స్, క్లాస్‌లు ఎగ్రిమెంట్ లో పెట్టడంతో విసుగెత్తిన మహేష్..డీల్ వద్దనుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

కార్పోరేట్ సంస్ధలతో డీల్స్ అనేసరికి రకరకాల లెక్కలు, క్లాస్ లు ఉంటాయని, అవి సహజమని అంటున్నారు. రెగ్యులర్ గా ఇండిడ్యువల్ ప్రొడ్యూసర్స్ కు అలవాటుపడిన మన హీరోలు అన్ని కండీషన్స్ భరించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారని, తమ డిమాండ్ మేరకే నిర్మాతలు వస్తున్నారు కాబట్టి వారు డిమాండ్ చేస్తూ కండీషన్స్ పెట్టకూడదని అంటున్నారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో కార్పోరేట్ కల్చర్ పెద్దగా రాలేకపోతోందని అంటున్నారు.

English summary
Mahesh Babu’s upcoming film in Koratala Siva’s direction is all set to go on floors in July this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu